ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ఎందుకంటే......

Published : Apr 13, 2019, 07:40 PM IST
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ఎందుకంటే......

సారాంశం

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీ లిగ్ లో శేఖర్ తన కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు. శేఖర్ కుమార్తె ఇందూశ్రీ ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఇందూశ్రీ తన బాబాయ్ కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ విషయం ఇందూశ్రీకి తెలుసు. కానీ ఆమె తన తల్లిదండ్రులకు గానీ, బంధువులకు గానీ చెప్పకుండా ఉండిపోయింది.

హైదరాబాద్: మణికొండ చిత్రపురికాలనీలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని నాలుగో అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 

వివరాల్లోకి వెళ్తే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీ లిగ్ లో శేఖర్ తన కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు. శేఖర్ కుమార్తె ఇందూశ్రీ ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఇందూశ్రీ తన బాబాయ్ కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయింది. 

ఆ విషయం ఇందూశ్రీకి తెలుసు. కానీ ఆమె తన తల్లిదండ్రులకు గానీ, బంధువులకు గానీ చెప్పకుండా ఉండిపోయింది. ఇందూశ్రీకి విషయం తెలుసు అని గమనించిన తండ్రి శేఖర్ శనివారం సాయంత్రం నిలదీశారు. 

తన సోదరుడు కుమార్తె ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. అనంతరం మందలించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇందూశ్రీ ఎల్ఐజీ బ్లాక్ 18 లో నాలుగో అంతస్తు పై నుంచి కిందకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. 

తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..