వరద ముంపు సమస్య పరిష్కారానికి నిధులు తెస్తే కిషన్ రెడ్డిని సన్మానిస్తాం.. కేటీఆర్

Published : Mar 16, 2022, 02:25 PM IST
వరద ముంపు సమస్య పరిష్కారానికి నిధులు తెస్తే కిషన్ రెడ్డిని సన్మానిస్తాం.. కేటీఆర్

సారాంశం

హైదరాబాద్ మహానగరంలో వరదముంపు సమస్య పరిష్కారానికి బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తేవాలని కేటీఆర్ అన్నారు. అలా తెస్తే కిషన్ రెడ్డికి స్వయంగా పౌర సన్మానం చేయిస్తామని తెలిపారు.

హైదరాబాద్ : నగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి Kishanreddy రూ.10వేల కోట్లు నిధులు తేవాలని.. అలా తెస్తే పౌర సన్మానం చేస్తానని మంత్రి KTR అన్నారు. మహానగర అభివృద్ధికి BJP నేతలు పోటీ పడాలని చురకలంటించారు. ఇవాళ ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎల్బీనగర్ కూడలిలో GHMC నిర్మించిన అండర్ పాస్, బైరామల్ గూడలో ఫైఓవర్ లను కేటీఆర్ ప్రారంభించారు. నాగోల్, బండ్లగూడలో నాలాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. 

వరద ముంపు నివారణకు రూ.103 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేస్తామన్నారు. ఎల్బీనగర్ లో స్థలాల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడు నెలల్లో కొత్త పింఛన్లు ఇస్తామన్న మంత్రి.. అభివృద్ధి చేసేందుకు బీజేపీ కార్పొరేటర్లు కూడా ముందుకు రావాలన్నారు. ఎస్ఆర్ డీపీ పథకం కింద రూ.40కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ అండర్ పాస్, రూ.29కోట్లతో బైరామల్ గూడ ఫ్లైఓవర్ లను నిర్మించారు. 

ఇదిలా ఉండగా, మార్చి 14న రాష్ట్రలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌నీ, దీని కోసం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌ను సాంకేతిక‌త‌కు మ‌రింత చేరువ చేసే విధంగా, వారి అభివృద్దికి దోహ‌ద‌ప‌డే విధంగా ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు. సోమవారం నాడు నాన‌క్‌రామ్‌గూడ వ‌న్ వెస్ట్‌లో గ్రామీన‌ర్ డేటా సెంట‌ర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. సాంకేతిక‌త ద్వారా స‌మాజంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం దేశంలో డేటా సైన్స్ రంగం వేగంగా పుంజుకుంటోంద‌న్నారు.

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్యం, రవాణా మరియు ఇతర విభాగాలలో డేటాను ఉపయోగించి జనాభా స్థాయి సమస్యలను పరిష్కరించడానికి కంపెనీలు మరియు స్టార్టప్‌లతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. నగరంలోని సరస్సులను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని బిల్డర్ కమ్యూనిటీని కోరారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర విభాగాలలోని గ్రామీన‌ర్‌ వంటి డేటా సైన్స్ కంపెనీలతో కలిసి భవన నిర్మాణ అనుమతి ప్రక్రియలను సులభతరం చేయడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి మరియు ఇతర విభాగాలతో సమన్వయాన్ని పెంచడానికి పరిష్కారాలను రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలంగాణ గుర్తించింది. తెలంగాణ ఆవిర్భవించిన వెంటనే 'సమగ్ర కుటుంబ సర్వే' అనే భారీ డేటా సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని, రాష్ట్రంలోని అన్ని కుటుంబాలను కవర్ చేసే రకమైన కసరత్తుల్లో ఒకటైన డేటా సైన్సెస్ అండర్‌రేట్ చేయబడిన విభాగాలలో ఒకటని మంత్రి కేటీఆర్ అన్నారు. అనేక సమస్యలను పరిష్కరించడానికి భారీ సామర్థ్యం క‌లిగిన డేటా సైన్సెస్ ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని తెలిపారు. తెలంగాణ రెండేళ్ల క్రితం 36 కోట్ల డేటా సెట్‌లను రూపొందించిందని, వాటి సంఖ్య పెరుగుతోందని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు