తెలంగాణలో ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

Published : Mar 16, 2022, 01:06 PM ISTUpdated : Mar 16, 2022, 01:08 PM IST
తెలంగాణలో ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

సారాంశం

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. మే ఆరునుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేడరకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. 

హైదరాబాద్ : తెలంగాణలో  inter examinations కొత్త షెడ్యూల్ విడుదలయ్యింది. మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మే 6నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు inter board తెలిపింది. జేఈఈ మెయిన్-1 పరీక్షల తేదీలు మారడంతో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ మార్చాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్టీఏ ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 21న మొదలై, మే 4వ తేదీనన ముగియనున్నాయి.  దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెన్త్ పరీక్షల షెడ్యూల్లో కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా, తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా ఈ రోజే విడుదల అయింది. రాష్ట్రవ్యాప్తంగా మే నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ షెడ్యూల్‌ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. పది పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.

పదో తరగతి పరీక్షల టైం టేబుల్ ఇలా ఉంది. మే 23న అంటే సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత వరుసగా 24వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 25న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) పరీక్షలు ఉండనున్నాయి. మే 26వ తేదీన అంటే గురువారం గణితం, 27న భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం ఎగ్జామ్, 28న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నారు. మే 30వ తేదీన అంటే సోమవారం ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, మే 31వ తేదీన ఓఎస్ఎస్‌సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు ఉంటాయి. కాగా, జూన్ 1వ తేదీన చివరి ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) ఉంటుంది. ఈ ఒక్క పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ