ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్‌కు భారీ స్పందన.. 15 రోజుల్లో దిమ్మదిరిగే వసూళ్లు

Published : Mar 17, 2022, 01:53 PM ISTUpdated : Mar 17, 2022, 02:02 PM IST
ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్‌కు భారీ స్పందన.. 15 రోజుల్లో దిమ్మదిరిగే వసూళ్లు

సారాంశం

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కట్టుకోవడానికి ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్‌కు భారీ స్పందన వస్తున్నది. గడిచిన 15 రోజుల్లో సుమారు రూ. 130 కోట్లు ఈ ఆఫర్ కింద వసూలు అయ్యాయి. సుమారు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో ప్రకటించిన ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్‌కు భారీ స్పందన వచ్చింది. పెద్ద మొత్తంలో వాహనదారులు తమ చలాన్లు కట్టుకున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. ఈ చలాన్ల కింద సుమారు రూ. 130 కోట్ల ఫైన్‌లు వాహనదారులు కట్టారు. ఇందులో 80 శాతం మంది వాహనదారులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని వారే ఉన్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు అమలులో ఉండనుంది. వాహనదారులు మొదటి రోజే 5.5 కోట్ల ఫైన్‌లు చెల్లించారు.

ఈ నెల ఆఖరు వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉండనుంది. కాబట్టి, ఈ గడువును సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులు వాహనదారులను కోరారు. చలాన్లు తనిఖీల్లో ఉంటే.. వాటి మొత్త బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ నెలతో డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది. ఈ గడువులో వాహనదారులు తమ పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకుంటే.. ఆ తర్వాత అంటే ఏప్రిల్ నెల నుంచి పెండింగ్ చలాన్లు ఉంటే ట్రాఫిక్ అధికారులు వాహనదారులపై కొరడా ఝుళిపించే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ చలాన్లపై చార్జిషీట్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

చలాన్లు ఇంకా చెల్లించని వారు ఇప్పటికైనా ఆన్‌లైన్‌లో లేదా మీ సేవ, ట్రాఫిక్ కంట్రోల్ రూంల వద్ద చెల్లింపులు చేసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ చలాన్లకు సంబంధించి https:/echallan.tspolice.gov.in లింక్ ద్వారా రాయితీతో జరిమానా కట్టుకోవచ్చని వివరించారు.

భారీ డిస్కౌంట్ ఆఫర్‌లో బాగంగా నో మాస్క్ చలాన్లకు 90 శాతం రాయితీ ఇస్తున్నారు. కాగా, టూ వీలర్, త్రీ వీలర్ వాహనాలకు 75 శాతం, లైట్, హెవీ మోటార్ వెహికల్స్‌కు 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. కాగా, తోపుడు బండ్లకూ చలాన్లపై 75 శాతం రాయితీ ఇస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu