వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..

By sivanagaprasad KodatiFirst Published Dec 14, 2018, 10:43 AM IST
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయం ఆ పార్టీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసీఆర్ తన తర్వాత కేటీఆర్‌కే పార్టీ, ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తారని తెరాస రాజకీయాలను చూస్తున్న వారందరికి తెలుసు. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయం ఆ పార్టీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసీఆర్ తన తర్వాత కేటీఆర్‌కే పార్టీ, ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తారని తెరాస రాజకీయాలను చూస్తున్న వారందరికి తెలుసు. 

అది కూడా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాతో, లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు ఇది కచ్చితంగా జరుగుతుందని ఊహించారు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే.. కనీసం మంత్రిమండలి కూర్పు కూడా పూర్తవ్వకముందే కేసీఆర్ ఊహించని నిర్ణయం తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు. 

ఇదిలా వుంటే టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకుని, ఆవిర్భావం నుంచి నేటి వరకు మావయ్య కేసీఆర్ వెంట నడిచిన హరీశ్‌రావు పార్టీలో నెంబర్-2 పొజిషన్‌లో ఉన్నారు. అయితే కేటీఆర్ రాకతో హరీశ్ ప్రాధాన్యత తగ్గింది. టీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్‌రావుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ప్రచారం సైతం జరిగింది. 

కానీ కేటీఆర్, హరీశ్‌రావులు ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. అధినేత నిర్ణయమే తమకు శిరోధార్యమని ఆయన మాటను తూచా తప్పకుండా పాటిస్తామని చెబుతూ వచ్చారు. అయితే ఉన్నపళంగా కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయడం హరీశ్‌ జీర్ణించుకోవడం కష్టమే. త్వరగా మేలుకోకుంటే రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీ కూడా బావ ఎగరేసుకుపోతాడని హరీశ్‌రావుకు సన్నిహితులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మరి హరీశ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్
 

click me!
Last Updated Dec 14, 2018, 10:44 AM IST
click me!