సమ్మెను విరమించకపోతే చర్యలు తప్పవు: జూడాలకు కేటీఆర్ హెచ్చరిక

By narsimha lodeFirst Published May 26, 2021, 2:27 PM IST
Highlights

జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించాలని  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించాలని  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బుధవారం నాడు  తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లు తక్షణమే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని ఆయన కోరారు.  సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

also read:జూడాల డిమాండ్లను పరిష్కరించాలి: మాజీ మంత్రి ఈటల రాజేందర్  

జూడాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని ఆయన చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు. మానవతాథృక్ఫథంతో వ్యవహరించాల్సిన సమయంలో  సమ్మె చేయడం సరైంది కాదని కేటీఆర్ కోరారు. జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫెండ్  అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వైద్యులు, వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం ఇన్సెంటివ్ ను ప్రకటించినా కూడ ఇంకా అమలు చేయలేదు. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న హెల్త్ వర్కర్స్   కరోనా బారిన పడితే నిమ్స్ లో  చికిత్స అందించాలనే తదితర డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. 

click me!