
కెటిఆర్ ఎక్కడ? తిరుమలకు రాలేదెందుకు? కెసిఆర్ తిరుమల యాత్రలో వెలితి కనిపించింది.
తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తిరుమల యాత్ర నిన్న దిగ్విజయంగా జరిగింది.
కెసిఆర్ కుటుంబ సభ్యులు రేణిగుంట ఎయిర్ పోర్టులో దిగినప్పటినుంచి పూజలన్నీ ముగిసే దాకా సకల మర్యాదలు అందుకున్నారు.
కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వం తరఫున రు.5 కోట్ల విలువయన కాన్కలు స్వామివారికి బహూకరించడం... దానికి తోడు తెలంగాణా సాధనపట్టుదల ఇవన్నీ కలసి కెసిఆర్ కుటుంబానికి ఈ యాత్ర ఒక అసాధారణ విషయమయింది.
కుటుంబచరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే విశేషంగా మిగిలిపోయింది.
ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు,అనేక మంది క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు ఈ పుణ్యయాత్రకు వచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. ప్రసాదాలు అందుకున్నారు. అందరు గ్రూఫ్ ఫోటోలు దిగారు. టిటిడి ఇవో సాంబశివరావు ముఖ్యమంత్రి ని ప్రశంసిస్తూ కెసిఆర్ ను అపర శ్రీకృష్ణ దేవరాయలు అన్నాడు. అదేరీతిలో స్పందిస్తూ దేవాలయం వైభవం చూశాక, ఇలాంటి ఆలయాన్నిహైదరాబాద్ లో నిర్మించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇలా ఏ విధంగా తీసుకున్నా కెసిఆర్ కుటుంబానికి ఈ యాత్ర చాలా ముఖ్యమయినది.
అయితే, ఈ పోటోలలో ఒక్క వెలికి కనిపిస్తుంది. అది ఎక్కడ తెలంగాణా ఐటి శాఖ మంత్రి, కెసిఆర్ కుమారుడు,కాబోయే ముఖ్యమంత్రిగా అంతా భావించే కె టిరామారావు కనిపించకపోవడం. అయన భార్య, కుమారులు, కవిత కుటుంబ సభ్యులున్నా, కెటిఆర్ కనిపించకపోవడం చాలా మంది ఆశ్చర్య పరిచింది.
కుటంబం మొక్కబడి తీర్చుకుంటున్నపుడు పెద్ద కొడుకు ,వారసుడు లేకపోవడమేమిటనే ప్రశ్న చిన్న చర్చకు దారి తీసింది.
ఇంతకు చెప్పొచ్చే దేమేంటే, ఆమెరికా లో చదువుకున్న కెటిఆర్ కు మరీ అంత భక్తి భావం లేదని, ఆయనకు ఇలా యాగాలు, మొక్కబడుల మీద నమ్మకం లేదని చెబుతారు.
మరీ ఆయన నాస్తికుడా ?
తెలియదంటున్నారు ఆయన్నెరిగిన వాళ్లు. ఇతర మంత్రులాగా కెటిఆర్ గుళ్లు గోపురాలకు వెళ్లిందిలేదనే చెప్పాలి. లేదా బాగా తక్కువనే చెప్పాలి.
కెటిఆర్ ఏ గుళ్లకు వెళ్లారో చూద్దామని గూగుల్ సెర్చ్ చేస్తే టాప్ 25 రిజల్ట్స్ లో వచ్చింది ఒకే ఒక్క గుడిసందర్శన. అది కూడా వేములవాడ గుడి. ఆయన సందర్శనలన్నీ గనులు, ఐటిసెంటర్లు, చేనేత కార్మికుల ఇళ్లే... వగైరా వచ్చాయి.