తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ యోచనలో కేసీఆర్, సీఎం గా కేటీఆర్?

By narsimha lode  |  First Published Dec 17, 2019, 7:43 AM IST

తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.



హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. గతంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏర్పాటు ఉన్ననేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ తరహాలోనే స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే , తెలంగాణ రాష్ట్ర అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందనే ప్రచారంలో ఉంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Latest Videos

Also read:కొత్త ఏడాదిలో కేటీఆర్‌కు సీఎం పగ్గాలు?

తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ లో  కౌన్సిల్ ఛైర్మెన్ తో పాటు కొత్త సీఎం, కొత్త మంత్రులు, స్టేట్ ప్లానింగ్ బోర్డు డిప్యూటీ ఛైర్మెన్ బి.వినోద్ కుమార్, చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ తదితరులు ఈ కమిటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన సమయంలో ఈ కౌన్సిల్ లో విధాన నిర్ణయాలపై చర్చించనున్నారు. 

కేసీఆర్ కు పరిపాలనపై మంచి పట్టుంది. తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ శక్తివంతమైన సంస్థగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ నుండి కేసీఆర్ విధులు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

2020లో తెలంగాణ సీఎంగా కేటీఆర్ కు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల తర్వాతే సీఎం కేసీఆర్  కేటీఆర్ కు బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం కూడ సాగింది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు. కానీ, ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ సీట్లు దక్కడంతో ఫెడరల్ ఫ్రంట్ కు అవకాశం లేకుండాపోయింది.


 

click me!