కుళ్లిన స్థితిలోకి దిశ నిందితుల మృతదేహాలు: ఎంబామింగ్‌పై వైద్యుల తర్జనభర్జన

By sivanagaprasad Kodati  |  First Published Dec 16, 2019, 9:21 PM IST

దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు కుళ్లిన స్థితికి చేరుకుంటున్నాయి. మృతదేహాలకు రీ ఎంబామింగ్ చేసే ఆలోచలనో ఫోరెన్సిక్ వైద్యులు వున్నప్పటికీ.. కోర్టు ఆదేశాలు భద్రపరచడం వరకే ఉండటంతో తర్జనభర్జన పడుతున్నారు.


దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు కుళ్లిన స్థితికి చేరుకుంటున్నాయి. మృతదేహాలకు రీ ఎంబామింగ్ చేసే ఆలోచలనో ఫోరెన్సిక్ వైద్యులు వున్నప్పటికీ.. కోర్టు ఆదేశాలు భద్రపరచడం వరకే ఉండటంతో తర్జనభర్జన పడుతున్నారు. ఒకవేళ రసాయనాలు పూస్తే తిరిగి పోస్టుమార్టం చేయలేని పరిస్ధితి తలెత్తుతుందని వైద్యులు సంకోచిస్తున్నారు. 

దిశా హత్యాచారం నిందితుల ఎన్కౌంటర్ తరువాత ఆ నిందితుల శవాలను ఖననం చేయకుండా కోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రిలోని మార్చురీ లో భద్రపరిచిన విషయం తెలిసిందే. 

Latest Videos

Also Read:దిశ కేసు నిందితుల మృతదేహాలకు ప్రత్యేక ఇంజక్షన్: ఎంబామింగ్ అంటే....

సాధారణంగా శవం ఒక రోజుకే కుళ్లిపోతుంది, అలాంటిది శవాన్ని సుప్రీమ్ కోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భద్రపరచాలి హై కోర్ట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సగటు మానవుడికి వచ్చే ప్రశ్న. శవాన్ని ఇన్ని రోజులపాటు ఎలా ఉంచబోతున్నారు?

సైన్స్ అభివృద్ధి చెందడంతో ఎంబామింగ్ అనే ప్రక్రియ ద్వారా శవాన్ని నిల్వ ఉంచబోతున్నారు. శరీరానికి క్రిములను దూరంగా ఉంచుతూ పాడవనీయకుండా ఉంచే కొన్ని మిశ్రమాల కలయికనే మనం ఎంబామింగ్ మిశ్రమం అంటాము. ఈ మిశ్రమాన్ని శవం లోపలికి బలమైన పీడనం తోపాటుగా జొప్పిస్తారు. 

ఫార్మల్డెహైడ్, గ్లుటారాల్డిహైడ్,మిథనాల్ ల మిశ్రమాన్ని మనం ఎంబామింగ్ ఫ్లూయిడ్ లేదా ఎంబామింగ్ మిశ్రమం అంటుంటాము.   ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో కూడా శవాలు పాడవకుండా ఇదే ఎంబామింగ్ మిశ్రమాన్ని శవాలకు ఎక్కిస్తున్నారు. 

తెలంగాణ హైకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై గత శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల మృతదేహాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Also read:దిశ మృతదేహంలో మద్యం...పోలీసుల చేతికి కీలక ఆధారం

జాతీయ మానవ హక్కుల కమీషన్ మళ్లీ నిందితుల మృతదేహాలను రీ పోస్ట్‌మార్టం కోరవచ్చని.. అప్పటి వరకు డెడ్ బాడీలను భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.

click me!