పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో క్షుద్రపూజల కలకలం (వీడియో)

By AN Telugu  |  First Published Aug 14, 2021, 12:10 PM IST

ఊరి బయట  అర్ధరాత్రి  క్షుద్రపూజలు, చేతబడి చేయడంతో రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే కూడా భయాందోళన చెందుతున్నారు. ఉదయం పూట వాకింగ్కు వెళ్లే వాళ్లు కూడా భయంతో అటు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.


పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో క్షుద్రపూజల కలకలంతో  స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సుల్తానాబాద్ సమీపంలోని గట్టెపల్లి రోడ్డులో ఎస్సారెస్పీ కెనాల్ వద్ద   ఎర్రగుడ్డలో నిమ్మకాయలు, కుంకుమ, కొబ్బరి కాయ, పిండి బొమ్మలతో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. 

"

Latest Videos

undefined

ఊరి బయట  అర్ధరాత్రి  క్షుద్రపూజలు, చేతబడి చేయడంతో రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే కూడా భయాందోళన చెందుతున్నారు. ఉదయం పూట వాకింగ్కు వెళ్లే వాళ్లు కూడా భయంతో అటు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో క్షుద్ర పూజలు, చేతబడి చేస్తున్నారు. శ్రావణ మాసంలో క్షుద్రపూజలు చేస్తే  ఖ‌చ్చితంగా జరుగుతాయని అనాదిగా వస్తున్న ఆచారం అని జనానికి ఒక నమ్మకం.      

అనుకోకుండా వాటిపై నుండి దాటడంతో  అనారోగ్యానికి  గురవుతామని అనుమానంతో   జనం భయపడిపోతున్నారు.  ఏది ఏమైనా సైన్ ఎంత అభివృద్ది చెందుతున్న అంతరిక్షంలోకి వెళ్తున్న  ఈ తరుణంలో  కూడా ఇంకా జనం మూఢనమ్మకాల  ఊబి నుండి బయటకు రావాలని పోలీసులు కోరుతున్నారు. శ్రావణ మాసంలో   ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

click me!