
టెస్టు క్రికెట్ లోనే ఏదో మాయ ఉందని తతెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ టెస్టు ఫార్మాట్ లో ఉన్న మజా నే వేరని.. బాల్ విపరీతంగా స్వింగ్ అయ్యేలా లార్డ్స్ లాంటి మైదానాల్లో టెస్టు క్రికెట్ ఆడితే.. ఆ మజానే వేరంటూ .. కేటీఆర్ పేర్కొనడం గమనార్హం.
ప్రస్తుతం లండన్ లోని లార్డ్స్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడుతోంది. రెంటో టెస్టు మ్యాచ్ సందర్భంగా.. ట్విట్టర్ లో కేటీఆర్.. ఈ విధంగా స్పందించడం గమనార్హం. ఈ మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లీ.. ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ స్వింగ్ బౌలింగ్ ని ఎదుర్కొన్న తీరు చాలా అద్భుతంగా ఉదంటూ.. కేటీఆర్.. ప్రశంసలు కురిపించారు.
ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన అమోఘ ప్రదర్శనతో మ్యాచ్ కి మరింత కళ తీసుకువచ్చాడని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ కన్నా లీడ్ లో ఉంది. ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తూ.. టీమిండియా ఆటగాళ్లు అదరగొడుతుండటం విశేషం.