
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదంపై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టి.ఎం.సి.ల నీళ్లు కేటాయించిన విషయం తెలిసింది.
అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో నదీ జలాల పంపకంపై వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై కోర్టు ఆరా తీసింది. ఏపీ, తెలంగాణ మధ్యే పంపకాలు జరపాలన్న ట్రైబ్యునల్ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణకు ఏపీ, తెలంగాణ హాజరు కావాలని ట్రైబ్యునల్ చెప్పినట్లు తెలిపింది.
జనాభాకు అనుగుణంగా నీటి కేటాయింపులు లేవని.. 25 శాతం ఉన్న తెలంగాణకు 12 శాతం జలాలు కేటాయించారని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తదుపరి విచారణ జనవరి 19కి వాయిదా పడింది.