పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ సర్కార్ అభ్యంతరం: రేపు కృష్ణా రివర్ బోర్డు భేటీ

By narsimha lodeFirst Published May 12, 2020, 12:08 PM IST
Highlights

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఈ నెల 13వ తేదీన  సమావేశం కానుంది. పోతిరెడ్డి పాడు  ప్రవాహ సామర్ధ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది


హైదరాబాద్:  కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఈ నెల 13వ తేదీన  సమావేశం కానుంది. పోతిరెడ్డి పాడు  ప్రవాహ సామర్ధ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది.ఈ విషయమై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడ నిర్ణయం తీసుకొంది.

శ్రీశైలం ప్రాజెక్టు నుండి రోజూ మూడు టీఎంసీల కృష్ణా జలాలను  ఎస్ఆర్‌బీసీ ద్వారా ప్రధాన కాల్వలో పోయడంతో పాటు పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్ధ్యాన్ని 80 వేలకు పెంచేందుకు విస్తరణ, లైనింగ్ పనులు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. మరో వైపు గాలేరు- నగరి , ఎస్ఆర్ బీ సీ కాల్వల ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కుల పెంచాలని కూడ ఏపీ సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు రూ.6,8219.15 కోట్ల అంచనా వ్యయానికి ఏపీ సర్కార్ ఆమోదం తెలుపుతూ ఈ నెల 5న జీవో కూడ జారీ చేయడం తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖాధికారులతో సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. కొత్తగా ప్రాజెక్టు నిర్మాణానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

అయితే పోతిరెడ్డి పాడు విస్తరణ పనుల విషయంలో ఏపీ సర్కార్ అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోలేదు. ఈ విషయమై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు  సుప్రీంకోర్టులో కూడ న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

పోతిరెడ్డి పాడు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు కృష్ణా బోర్డు ఈ నెల 13వ తేదీన వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ విషయమై చర్చించనున్నారు. ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను రెండు రాష్ట్రాలు చెప్పే అవకాశం ఉంది.

click me!