ఏపీ- తెలంగాణ నదీ జలాల వివాదం: కృష్ణా యాజమాన్య బోర్డు కీలక ప్రకటన

Siva Kodati |  
Published : Jun 04, 2020, 07:45 PM IST
ఏపీ- తెలంగాణ నదీ జలాల వివాదం: కృష్ణా యాజమాన్య బోర్డు కీలక ప్రకటన

సారాంశం

ఇరు ప్రభుత్వాల వాదనలు విన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇరు రాష్ట్రాలు డీపీఆర్‌లను తమకు సమర్పించాలని.. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకుని డీపీఆర్‌లు ఇచ్చేందుకు అదికారులు అంగీకరించారని బోర్డు వెల్లడించింది. ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం  చేశారు

తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా నదీ జలాలకు సంబంధించిన వివాదంపై కృష్ణా వాటర్ బోర్డు ఇరు ప్రభుత్వాల వాదనలు పరిశీలించింది. డీపీఆర్, నీటి కేటాయింపులు, టెలీ మెట్రీపై బోర్డు చర్చించింది.

తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్ మార్చిందని కృష్ణా వాటర్ బోర్డ్ ఛైర్మన్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. అందుకే తెలంగాణ ప్రాజెక్టులను కొత్తవిగా భావించాలని ఏపీ బోర్డు దృష్టికి తీసుకెళ్లింది.

దీనిపై స్పందించిన ఛైర్మన్... తెలంగాణ ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల ఏపీకి నష్టమని అన్నారు. ఏపీకి నీటి కేటాయింపుల ఆధారంగానే పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు ప్రారంభించిదని ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు.

Also Read:కృష్ణా రివర్ బోర్డు మీటింగ్: పోతిరెడ్డిపాడు, పాలమూరు ప్రాజెక్టుల భవితవ్యం తేలేనా?

అదే సమయంలో తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎట్టి పరిస్ధితుల్లోనూ చేపట్టోద్దని కోరారు. విభజన అనంతరం చేపడుతున్న ప్రాజెక్టులు కాబట్టీ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి ఆయన రజత్ అన్నారు.

16.5 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి రావాలని.. ఇందుకు సంబంధించిన లెక్కలు చూపించామని ఆయన తెలిపారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ప్రజేంటేషన్ ఇచ్చామన్నారు.

ఇరు ప్రభుత్వాల వాదనలు విన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇరు రాష్ట్రాలు డీపీఆర్‌లను తమకు సమర్పించాలని.. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకుని డీపీఆర్‌లు ఇచ్చేందుకు అదికారులు అంగీకరించారని బోర్డు వెల్లడించింది.

ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం  చేశారు. రెండో దశ టెలీమెట్రీని ప్రాధాన్య క్రమంగా పరిగణనలోనికి తీసుకుని, అమలు చేసేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారాన్ని తెలిపాయని ఆయన చెప్పారు.

Also Read:పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వివాదం... ఏపి ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేఖ

శ్రీశైలం నుంచి రెండు రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో విద్యుత్ వినియోగం, వరద జలాల అంశాన్ని కమిటీ పరిశీలిస్తుందని ఛైర్మన్ చెప్పారు. తాగునీటి వినియోగాన్ని 20 శాతమే లెక్కించాలన్న అంశాన్ని , కేంద్ర జల సంఘానికి నివేదించామని ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు.

గోదావరి నుంచి కృష్ణాకు తరలించిన జలాలా అంశాన్ని కేంద్ర జలశక్తికి నివేదించామని ఆయన చెప్పారు. బోర్డు తరలింపు అంశంపై కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu