తెలంగాణలో 45 మంది వైద్యులకు కరోనా కలకలం: క్వారంటైన్‌కి తరలింపు

By narsimha lode  |  First Published Jun 4, 2020, 4:35 PM IST

 తెలంగాణ రాష్ట్రంలో  45 మంది వైద్యులకు కరోనా వైరస్ సోకింది. కింగ్ కోఠిలో పనిచేస్తున్న ముగ్గురు శానిటేషన్ సిబ్బందికి కరోనా సోకింది. వీరందరిని క్వారంటైన్‌కి తరలించారు.
 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  45 మంది వైద్యులకు కరోనా వైరస్ సోకింది. కింగ్ కోఠిలో పనిచేస్తున్న ముగ్గురు శానిటేషన్ సిబ్బందికి కరోనా సోకింది. వీరందరిని క్వారంటైన్‌కి తరలించారు.

గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు పీజీ వైద్యులతో పాటు సీనియర్ ఫ్యాకల్టీకి కూడ కరోనా సోకింది. 10 మంది ఇంటర్న్స్ విద్యార్థులకు కరోనా సోకింది. నిమ్స్ లో పనిచేస్తున్న 8 మంది పీజీ విద్యార్థులకు కరోనా సోకింది.

Latest Videos

undefined

also read:నివేదిక ఇవ్వండి: వైద్య సిబ్బందికి కరోనా, తెలంగాణ హైకోర్టు సీరియస్

కింగ్ కోఠిలో పనిచేస్తున్న ముగ్గురు పారిశుద్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఇక్కడ పనిచేసే పారిశుద్య సిబ్బందిని కూడ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కి తరలించనున్నారు.

తెలంగాణలోని మూడు మెడికల్ కాలేజీల్లోని వైద్య సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందింది. దీంతో సుమారు 600 మందిని బుధవారం నాడు అధికారులు తరలించారు. ఈ నెల 20వ తేదీన పీజీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

also read:మూడు మెడికల్ కాలేజీల్లో కరోనా కలకలం: 600 మంది క్వారంటైన్‌కి తరలింపు

అయితే కరోనా కారణంగా పీజీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ తెర మీదికి వచ్చింది.ఈ విషయాన్ని డీఎంఈ, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ప్రభుత్వంతో చర్చించి పరీక్షలు వాయిదాపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

తెలంగాణలో వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకడంపై గురువారం నాడు హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. రక్షణ కిట్స్ ఇచ్చారా.. ఇవ్వలేదా....పీపీఈ కిట్స్ ఇస్తే వైద్య సిబ్బందికి కరోనా ఎలా సోకిందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 8వ తేదీ లోపుగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.


 

click me!