తాగు నీటికి ఏపీకి 2 టీఎంసీలకు తెలంగాణ ఒకే: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటి నిర్ణయం

By narsimha lodeFirst Published May 22, 2020, 1:59 PM IST
Highlights

: కృష్ణా రివర్ బోర్డు సెక్రటరీ పరమేశం ఇవాళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో శుక్రవారంనాడు సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య తాగు నీటి అవసరాలకు నీటి విడుదలపై చర్చ జరిగినట్గుగా తెలుస్తోంది.

హైదరాబాద్: కృష్ణా రివర్ బోర్డు సెక్రటరీ పరమేశం ఇవాళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో శుక్రవారంనాడు సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య తాగు నీటి అవసరాలకు నీటి విడుదలపై చర్చ జరిగినట్గుగా తెలుస్తోంది.

ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ, తెలంగాణ రాష్ట్ర ఈఎన్సీలతో కృష్ణా రివర్ బోర్డు సెక్రటరీ ఇవాళ సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం తాగు నీటి అవసరాల కోసం కృష్ణా నది నీటిని రెండు టీఎంసీలు ఇవ్వాలని కోరింది. 

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం, వివాదం సమసిపోయేనా...

ఏపీ అభ్యర్థనకు తాము సానుకూలంగా స్పందించినట్టుగా  తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు చెప్పారు. ఇవాళ్టి సమావేశంలో ఇతర విషయాలపై ఎలాంటి చర్చకు రాలేదని ఆయన స్పష్టం చేశారు.పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన 203 జీవో జారీ చేసింది.

మా వాటా నుండే  2 టీఎంసీలను నీటిని తీసుకెళ్తున్నట్టుగా  ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ చెప్పారు. సాగర్ కుడి కాల్వ నుండి తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్రం ఒప్పుకొందని ఆయన తెలిపారు.  గుంటూరు, ప్రకాశం జిల్లాలలకు తాగు నీరు అవసరాల కోసం ఈ నీటిని వినియోగించనున్నట్టుగా ఆయన చెప్పారు. సాగర్, శ్రీశైలం నుండి తమకు రావాల్సిన నీటి కేటాయింపులను వాడుకొంటున్నట్టుగా చెప్పారు.

ఈ జీవోపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుల విషయమై తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా, గోదావరి బోర్డులు వివరణ కోరాయి.పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా  కృష్ణా బోర్డు వివరణ కోరింది.

click me!