బీఆర్ఎస్ కంటోన్మెంట్ నేతల సమావేశానికి టిక్కెట్టు ఆశించిన క్రిశాంక్, నగేష్ లు హాజరు కాలేదు.
హైదరాబాద్: బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సమావేశానికి ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు దూరంగా ఉన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ నేతలతో ఆదివారంనాడు సమావేశమయ్యారు.
ఈ నెల 21న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానిని దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పేరును ప్రకటించారు సీఎం. అయితే ఈ స్థానం నుండి క్రిశాంక్, నగేష్ కూడ బీఆర్ఎస్ టిక్కెట్టు ఆశించారు.
undefined
ఇవాళ బీఆర్ఎస్ నేతలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి నేతలందరికి ఆహ్వానం పంపారు. కానీ, ఈ ఇద్దరు నేతలు ఈ సమావేశానికి హాజరు కాలేదు.
కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి క్రిశాంక్ లాంటి నేతలకు టిక్కెట్టు దక్కలేదని మంత్రి కేటీఆర్ కూడ పేర్కొన్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని టిక్కెట్ల జాబితాను ప్రకటించినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కంటోన్మెంట్ నుండి వరుస విజయాలు సాధించిన సాయన్న అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుండి ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్ఎస్ టిక్కెట్టును కేటాయించింది. అయితే ఈ స్థానం నుండి టిక్కెట్టు కోసం ప్రయత్నించిన క్రిశాంక్, నగేష్ లు తీవ్ర నిరాశకు గురయ్యారు. టిక్కెట్టు దక్కని కారణంగానే ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి ఈ ఇద్దరు నేతలు దూరంగా ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.
లాస్య నందితను లక్ష మెజారిటీతో గెలిపించాలి: తలసాని
విభేధాలను మరిచి పార్టీ ప్రకటించిన లాస్య నందిత గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సాయన్న మృతితో ఆయన కూతురు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిగా లాస్య నందితను బరిలోకి దింపిన విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాసా యాదవ్ గుర్తు చేశారు. విపక్ష పార్టీల నుండి కంటోన్మెంట్ నుండి అభ్యర్ధులను బరిలోకి దింపవద్దని ఆయన కోరారు. లాస్య నందితను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలను కోరారు.