ముందు కర్ణాటకలో అమలు చేయాలి: డిక్లరేషన్ల ప్రకటనపై ఖర్గేకు హరీష్ సూచన

By narsimha lode  |  First Published Aug 27, 2023, 2:32 PM IST

అధికారం కోసం తెలంగాణలో  కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిలో హామీలు ఇస్తున్నారని  మంత్రి హరీష్ రావు  విమర్శించారు.
 



మెదక్: ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో మొదట  డిక్లరేషన్లను అమలు చేయాలని ఆయన సూచించారు.సిద్దిపేటలో  ఆదివారంనాడు మంత్రి హరీష్ రావు దివ్యాంగులకు పెన్షన్లు అందించారు. లబ్దిదారులకు పెన్షన్ పత్రాలను మంత్రి అందించారుఈ సందర్భంగా నిర్వహించిన  సభలో  ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పలు అంశాలపై  విడుదల చేస్తున్న డిక్లరేషన్లపై  మంత్రి హరీష్ రావు స్పందించారు.

 16 రాష్ట్రాల్లో  బీడీ కార్మికులకు ఎక్కడా కూడ పెన్షన్ ఇవ్వడం లేదని  మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న  రాష్ట్రాలలో వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారు.

Latest Videos

కేసీఆర్ దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. కాంగ్రెస్ నేతలు డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లను ప్రకటిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి పెన్షన్లు లేని విషయాన్ని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.గృహలక్ష్మి  పథకంలో దివ్యాంగులకు  ఐదు శాతం రిజర్వేషన్లను  కల్పించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఐదు గ్రామాలకు  ఒక సెక్రటరీ ఉండేవారన్నారు.పంచాయితీ సెక్రటరీలు నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలని  మంత్రి కోరారు.

తెలంగాణలో  అధికారం కోసం  కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నారన్నారు. కానీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో  ఈ హామీలను అమలు చేయాలని  మంత్రి హరీష్ రావు సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు.   జీహెచ్ఎంసీ  ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తామని ఇచ్చిన హామీని మంత్రి హరీష్ రావు ప్రస్తావిస్తూ ఇప్పటికి బండి లేదు..గుండు లేదని ఆయన సెటైర్లు వేశారు.

click me!