గాయం కారణంగా వీల్ చైర్ లో వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో నామినేషన్ వేశారు.
దుబ్బాక : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో దుబ్బాక వచ్చారు ప్రభాకర్ రెడ్డి. వీల్ చైర్ లో వెళ్లి నామినేషన్ వేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. అక్టోబర్ 30 న ఎన్నికల ప్రచారంలో ఉండగా దుబ్బాకలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై అక్టోబర్ 30 నాడు దుబ్బాకలో హత్యాయత్నం జరిగింది. దీనికి నిరసనగా అక్టోబర్ 31దుబ్బాక బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. రాయపోల్, దుబ్బాక, తోగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, చేగుంట, నార్సింగి, అక్బర్ పేట- భూంపల్లి మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి.
ఇక దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా దుబ్బాక బీజేపీ ఎంపీ రఘునందన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో బంద్ లో భాగంగా మండల కేంద్రాలు, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు నల్లజెండాలతో నిరసన కార్యక్రమాల చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దుబ్బాకలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.