ఈటల రాజేందర్ ఫొటోతోనే గెలిచాం: దేసిన స్వప్న సహా 13 మంది కౌన్సిలర్లు

By telugu teamFirst Published May 16, 2021, 1:05 PM IST
Highlights

కొత్తపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ దేసిన స్వప్న సహా 13 మంది కౌన్సిలర్లు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు మద్దతు ప్రకటించారు. తాము ఈటెల రాజేందర్ ఫొటోతోనే గెలిచామని చెప్పారు.

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేసిని స్వప్న మద్దతు ప్రకటించారు. ఆమె ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శానికి 13మంది కౌన్సికర్లు హాజరయ్యారు. తాము ఈటల నాయకత్వంలో పనిచేస్తామని దేసిన స్వప్న చెప్పారు.

కొందరు టీఆర్ఎఎస్ పార్టీ నాయకులు మంత్రుల దగ్గరి నుండి బెదిరింపుల కాల్స్ వస్తున్నాయని, ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఈటలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారని ఆమె అన్నారు. "అయ్యా! సిఎమ్ కేసీఆర్!! మీరు రాత్రికి రాత్రే ఆర్డర్లు తయారు చేపించి, అధికారులను ట్రాన్స్ ఫర్ చెపిస్తున్నారు" అని ఆమె అన్నారు. 

హుజురాబాద్ నియోజక వర్గ ప్రజల గుండెల్లో నుండి  ఈటెల రాజేందర్ ను తీసివేయ లేరని ఆమె అన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయం నుండి కేసీఆర్ వెన్నంటే ఉండి అహర్నిశలు ఈటెల పని చేశారని ఆమె గుర్తు చేశారు.  అట్లాంటి తమ నాయకుడి మీద భూ  కబ్జా ఆరోపణలు చేయడం భావ్యమా అని ఆమె ప్రశ్నించారు.

ఈటెల మీద ఇంత కక్షపూరిత రాజకీయం చేయడం సరికాదని అన్ారు.  ఈటెల ను ఒంటరి చేద్దామనే ఆలోచన రావడం సిగ్గు చేటు అని ఆమె వ్యాఖ్యానించారు. ఈటెల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదారణ ఉందని, అయన ఒక శక్తి అని మరిచి పోవద్దని స్వప్న అన్నారు. తాము అందరం ఈటెల ఫోటో పెట్టుకొని గెలిచామని, ఆయన దయ వల్లనే తమకు ఈ పదవులు వచ్చాయని ఆమె అన్నారు

హుజురాబాద్ నియోజక వర్గంలో అణచివేత ధోరణి సాగిస్తున్నారని ఆమె విమర్శించారు. అణచివేత మంచిది కాదని చెప్పారు. తమకు, తమ ఈటెల కు ప్రాణ భయం ఉందని ఆమె అన్నారు.. 

న్యాయ స్థానాలు, కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవించు కుంటు న్నామని, దయ చేసి తమను కాపాడాలని కోరుకుంటున్నామని ఆమె అన్నారు. తల్లి నుండి బిడ్డను వేరు చేసినట్లు నియోజక వర్గ ప్రజల నుండి ఈటెలను వేరు చేయాలనుకోవడం సమంజసం కాదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిటిష్ పాలనను తలపిస్తుందని విమర్శించారు.  నియోజక వర్గ ప్రజలను కాపాడాలని న్యాయస్థానాల ను కోరుతున్నట్లు ఆమె తెలిపారు.

click me!