హైదరాబాదులో అమానుషం: భర్త మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని భార్య

Published : May 16, 2021, 08:19 AM IST
హైదరాబాదులో అమానుషం: భర్త మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని భార్య

సారాంశం

హైదరాబాదులోని పాతబస్తీలో అమానుషమైన సంఘటన జరిగింది. అనారోగ్యంతో మరణించిన భర్త మృతదేహాన్ని భార్య ఇంట్లోకి అనుమతించలేదు. గత 30 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. భర్త మృతదేహాన్ని భార్య ఇంట్లోకి అనుమతించలేదు. ఈ సంఘటన హైదరాబాదులోని పాతబస్తీలో గల ఛత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

ఉప్పుగుడా లలితాబాగ్ కు చెందిన భిక్షపతి గౌడ్ (60), లలిత దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లలితాబాగ్ లో ఓ ప్రైవేట్ పాఠశాలను నిర్వహించే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. 

దాంతో భార్యాభర్తలు గత 30 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. భిక్షపతి గౌడ్ తన కుమారుడితో కలిసి కర్మన్ ఘాట్ లో ఉంటున్నాడు. అతను అనారోగ్యంతో శుక్రవారం అర్థరాత్రి మరణించాడు. మృతదేహాన్ని తేవడానికి అద్దె ఇంటి యజమాని నిరాకరించాడు. 

దాంతో కుమారుడు తండ్రి మృతదేహాన్ని అంబులెన్స్ లో తల్లి వద్దకు తీసుకుని వచ్చాడు. తన అవసరం లేదంటూ వెళ్లిపోయి మళ్లీ ఎందుకు వచ్చారంటూ లలిత తన భర్త మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో మృతదేహాన్ని ఇటి ముందు రోడ్డుపైనే ఉంచారు. సమాచారం అందుకున్న ఛత్రినాక ఇన్ స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ జిలాని సర్ది చెప్పడంతో మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించారు. 

PREV
click me!

Recommended Stories

Naa anveshana: మొద‌లైన ఆపరేషన్ అన్వేష్‌.. ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు
Harish Rao on Revanth Reddy in Assembly:మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ | Asianet News Telugu