ఆసుపత్రిలో ఆడ్మిషన్‌కి నిరాకరణతో గర్భిణీ మృతి: మృత శిశువును వేరు చేసి అంత్యక్రియలు

By narsimha lodeFirst Published May 16, 2021, 9:34 AM IST
Highlights

గర్భిణీని ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవడంతో అంబులెన్స్‌లోని ఆమె మరణించిన ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది. మరణించిన తర్వాత కూడ కష్టాలు తప్పలేదు. కడుపులోని శిశువును వేరు చేసిన తర్వాత అంత్యక్రియలు చేశారు. ఈ ఘటనపై మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ అధికారి శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. 
 

హైదరాబాద్: గర్భిణీని ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవడంతో అంబులెన్స్‌లోని ఆమె మరణించిన ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది. మరణించిన తర్వాత కూడ కష్టాలు తప్పలేదు. కడుపులోని శిశువును వేరు చేసిన తర్వాత అంత్యక్రియలు చేశారు. ఈ ఘటనపై మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ అధికారి శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. 

హైద్రాబాద్ లోని మల్లాపూర్ నాగలక్ష్మినగర్ కు చెందిన గర్భిణీ  పావని  శుక్రవారం నాడు వైద్యం కోసం పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. కరోనా ఉందనే అనుమానంతో ఆసుపత్రుల్లో ఎవరూ కూడ తమ కూతురిని చేర్పించుకోలేదని మృతురాలు పావని పేరేంట్స్  జోగారావు, నీలవేణి ఆరోపించారు.  నగరంలోని ఐదు కార్పోరేట్ ఆసుపత్రుల చుట్టూ రోజంతా తిరిగినా కూడ  వారు తమ కూతురును చేర్పించుకోలేదన్నారు. దీంతో అంబులెన్స్ లోనే  పావని చనిపోయిందని తల్లిదండ్రులు చెప్పారు. 

శనివారం నాడు మల్లాపూర్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా  కడుపులో బిడ్డను వేరు చేయాలని అప్పుడే అంత్యక్రియలు నిర్వహిస్తామని స్మశానవాటికి సిబ్బంది చెప్పారు. దీంతో మళ్లీ మృతదేహంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారమైంది.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆాదేశంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో  పావని కడుపులోని మృత శిశువును వేరు చేశారు. ఆ తర్వాత పావని డెడ్‌బాడీకి ఆమె గర్భం నుండి వెలికి తీసిన మృత శిశువుకు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి మల్లిఖార్జునరావు కు విచారణ బాధ్యతలను అప్పగించారు. ఈ విషయమై పావని కుటుంబసభ్యులతో శనివారం నాడు జిల్లా వైద్యశాఖాధికారి విచారణ నిర్వహించారు. 

click me!