
kotha prabhakar reddy : లోక్‌సభ ఎంపీ పదవికి బీఆర్ఎస్ నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తన లోకసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. బుధవారం ఉదయం ఆయన లోక్ సభ స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖను అందించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు.. జిరాక్స్ సెంటర్ల ఘరానా మోసం
ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో ఆయన ఇక నుంచి ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. కాగా.. ఈ సారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పలువురు శాసన మండలిలో, లోక్ సభలో సభ్యులుగా ఉన్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే సభలో సభ్యుడిగా ఉండాలి. ఈ నేపథ్యంలో వారు ఏదో ఒక పదవికి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకే కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు.
Shivraj Singh Chouhan: "చావనైనా చస్తాను.. కానీ, అలా మాత్రం అసలు చేయను.."
అలాగే మల్కాజ్ గిరి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి కూడా తన సభ్యత్వానికి రాజీనామ చేశారు. ఆయన ఈ సారి కొడగంల్ నుంచి శాసన సభకు భారీ మెజారిటీతో గెలుపొందని సంగతి తెలిసిందే. భువనగిరి నుంచి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి, నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిద్దరూ కూడా తమ ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. వీరిద్దరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినేట్ లో మంత్రులుగా ఉన్నారు. తాజాగా వీరికి శాఖల కేటాయింపు కూడా జరిగింది. కోమటి రెడ్డి వెంకట రెడ్డికి రోడ్డు, భవనాల శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖను కేటాయించారు.
కేసీఆర్ గారూ... ఆర్నెళ్లలో కాంగ్రెస్ సర్కార్ కూలుతుందంటగా..: విజయశాంతి
ఈ సారి పలువురు ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెుల్యేలుగా ఎన్నికయ్యారు. అందుకే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల తెలంగాణ శాసన సభ (అసెంబ్లీ)కి జరిగిన ఎన్నికల్లో వీరంతా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా రాజీనామా పత్రాలను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఈ నెల 9వ తేదీన అందజేశారు. ఆయన వాటికి ఆమోద ముద్ర వేశారు.