పాడి కౌశిక్ రెడ్డి నోట జగన్ పాపులర్ డైలాగ్.. ‘మీరు కొట్టారు మేం తీసుకున్నాం’

By Mahesh K  |  First Published Mar 18, 2024, 4:06 PM IST

పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పాపులర్ డైలాగ్ కొట్టాడు. మీరు కొట్టారు మేం తీసుకున్నాం. మాకు టైం వస్తుంది. మేమూ కొడతాం అంటూ జగన్ చేసిన డైలాగ్‌ను ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాడు.
 


వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 2019లో 23 మంది ఎమ్మెల్యేలను లాక్కోవడంపై జగన్ ఆక్రోశంతో, ఆగ్రహంతో కామెంట్ చేశారు. ‘మీరు కొట్టారు. మేం తీసుకున్నాం. మా టైం వస్తుంది.. మేము కొడతాం’ అంటూ జగన్ ఆవేశంతో కొట్టిన డైలాగ్ సోషల్ మీడియాలో ఫేమస్. ఆ డైలాగ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ డైలాగ్ తరహాలోనే జగన్ అధికారంలోకి వచ్చారు. అంటే.. జగన్ కు టైం వచ్చింది. చంద్రబాబు నాయుడు, టీడీపీని గుక్కతిప్పుకోనివ్వని స్థితికి పంపించారు కూడా.

తాజాగా పాడి కౌశిక్ రెడ్డి ఏపీ సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యలనే రిపీట్ చేశారు. బీఆర్ఎస్ నుంచి నాయకులను కాంగ్రెస్‌లోకి ఆకర్షించే సందర్భాన్ని ఆయన నేపథ్యంగా చేసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిలను కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తూ రేవంత్ రెడ్డి నవ్వులు చిందిస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

BRS MLA Saying Jagan Anna Famous Dialogue 🔥

నువ్వు కొట్టినవ్ మేము తీసుకున్నాం.

మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా అయితవ్!!

- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ pic.twitter.com/fgEhSxhYlu

— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024)

Latest Videos

‘ఇవాళ ఆయన కొట్టాడు.. మేం తీసుకున్నాం. భవిష్యత్‌లో మేం కొడతాం. మా దెబ్బకు రేవంత్ లేవకుండా అవుతాడు’ అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ చేశాడు.

ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే  దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

click me!