ఈటలను ఎందుకు పార్టీలో కొనసాగిస్తున్నారు: కేసీఆర్‌కి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్న

By narsimha lodeFirst Published May 27, 2021, 11:14 AM IST
Highlights

 ఈటల రాజేందర్‌ను ఇంకా ఎందుకు పార్టీలో ఉంచుకొన్నారని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించారు. 
 

హైదరాబాద్:  ఈటల రాజేందర్‌ను ఇంకా ఎందుకు పార్టీలో ఉంచుకొన్నారని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించారు. గురువారం నాడు  మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేయవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. 

also read:ఈటలపై దాడి తెలంగాణ ఆత్మగౌరవంపై దాడే: కోదండరామ్

ఇంకా ఎందుకు ఆయనను టీఆర్ఎస్ లో కొనసాగిస్తున్నారో చెప్పాలన్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదన్నారు.తాను ప్రస్తుతానికి ఏ పార్టీలో నేనని ఆయన స్పష్టం చేశారు. భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేసినా పార్టీ నుండి సస్పెన్షనో, బహిష్కరణో ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. రాజకీయ కక్షలు తీర్చుకొనే సమయం ఇది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ వ్యతిరేకులను  ఏకతాటిపైకి తెచ్చే అభిప్రాయంతో ఉన్నామన్నారు. అయితే దీనికి తమకు తొందర అవసరం లేదన్నారు. ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు. బీజేపీలో మాజీ మత్రి ఈటల రాజేందర్ చేరుతారనే ప్రచారం  సాగుతున్న తరుణంలో ఈ భేటీకి రాజకీీయంగా ప్రాధాన్యత నెలకొంది. 

 

click me!