ఈటల ఎఫెక్ట్: తెలంగాణలో మారుతున్న సమీకరణాలు.. బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి..?

Siva Kodati |  
Published : Jun 03, 2021, 08:18 PM IST
ఈటల ఎఫెక్ట్: తెలంగాణలో మారుతున్న సమీకరణాలు.. బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి..?

సారాంశం

త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాళ బీజేపీ నేత డీకే అరుణతో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. ఆలస్యం చేయొద్దని వెంటనే నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ సూచించినట్లుగా తెలుస్తోంది.

త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాళ బీజేపీ నేత డీకే అరుణతో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. ఆలస్యం చేయొద్దని వెంటనే నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ సూచించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు కొండా కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. 

Also Read:బీజేపీలోకి ఈటల.. సొంత పార్టీ నేతలపై మండిపడ్డ రాజాసింగ్

మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరేందుకు ఆయనకు ఆ పార్టీ అగ్రనాయకత్వంతో ఆయన సమావేశమయ్యారు. గత నెల 31వ తేదీన న్యూఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ ఇవాళ ఉదయమే హైద్రాబాద్ కు చేరుకొన్నారు. మరోవైపు ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం తనతో చర్చించకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై బుధవారం నాడు పెద్దిరెడ్డితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ లో మాట్లాడారు.  బండి సంజయ్ ఫోన్ తో  పెద్దిరెడ్డి మెత్తబడినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే