షర్మిల పార్టీ పేరు ఖరారు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరిట సీఈసీ వద్ద రిజిష్ట్రేషన్

By Siva KodatiFirst Published Jun 3, 2021, 7:30 PM IST
Highlights

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు దూకుడుగా వెళ్తొన్న వైఎస్ షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వాడుక రాజగోపాల్ ఈ రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు దూకుడుగా వెళ్తొన్న వైఎస్ షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వాడుక రాజగోపాల్ ఈ రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పత్రాలను ఆయన కేంద్ర ఎన్నికల కమీషన్‌కు సమర్పించారు. అయితే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని పత్రికా ప్రకటనా కూడా ఇచ్చారు. 

Also Read:నీ పిల్లలకు ఉద్యోగాలిచ్చావ్... మరి ప్రజల పిల్లలకు ఎప్పుడు..: కేసీఆర్ పై షర్మిల సీరియస్

మరోవైపు నిరుద్యోగ యువత ఆత్మహత్యలను నిరసిస్తూ వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ లో పర్యటిస్తున్నారు. వెల్దుర్తి మండలంలోని శేరిల్లా గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులకు అండగా వుంటానని షర్మిల భరోసా ఇచ్చారు. 

ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని సాధించాలని భావించిన వెంకటేష్ డీఎస్సి కోచింగ్ తీసుకున్నాడు. కోచింగ్ తర్వాత కూడా ప్రిపరేషన్ కొనసాగించాడు. అయితే ఇటీవల ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రిపరేషన్ మరింత ముమ్మరం చేశాడు. అయితే ప్రకటన వెలువడి నెలలు గడుస్తున్నా ఎంతకూ నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్థాపానికి గురయిన వెంకటేష్ గత నెల మే16న ఆత్మహత్య చేసుకున్నాడు. 

click me!