ప్రధాని గారూ, ఉత్తరాంధ్ర గుర్తుందా???

First Published Nov 14, 2016, 8:38 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ, ఉత్తరాంధ్ర భూభాగాలు లేవన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నారు- కొణతాల రామకృష్ణ

నవంబర్ పదహారో తేదీనుంచి మొదలవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఉత్తరాంధ్ర సమస్యల గురించి ఒక సమగ్ర మయిన ప్రకటనచేయాలని మాజీమంత్రి ఉత్తరాంధ్ర హక్కుల ఉద్యమ నాయకుడు కొణతాల రామకృష్ణ  ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

 

 ఈ మేరకు ఆయన ప్రధాని కొక లేఖరాస్తూ, గత రెండున్నరేళ్లుగా వెనకబడిన ప్రాంతమయిన ఉత్తరాంధ్ర ను ప్రధాని విస్మరిస్తూ ఉండటం నిరాశకు గురించి చేసిందని అన్నారు.  2014లో  ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి అని ప్రకటించిన ప్రధాని , దానిని నొక నినాదంగా మిగిల్చారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు.

 

’దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అనే ధోరణిలో పనిచేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ, ఉత్తరాంధ్ర భూభాగాలు లేవనుకుంటున్నారు. ఈ విధానంలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాంతీయ అసమానాతు ఇంకా పెరిగిపోతున్నా’ యని  ఆయన ఈ లేఖలో నొక్కిచెప్పారు.

 

కేవలం రెండున్నరేళ్ల కిందట  మనుగడలోకి వచ్చిన ఒక రాష్ట్రం వెనకబడిన ప్రాంతాలు అగ్రహంతో తిరగబడే లాగా ప్రవర్తించడం ఏ మాత్రం అభిలషణీయం కాదని ఇలాంటి విధానాల వల్ల వచ్చే ముప్పును తట్టుకునే శక్తి ఆంధప్రదేశ్ కు లేదని అన్నారు.

 

ఉత్తరాంధ్రలోని కోటి జనాభా తరఫున లేఖ రాస్తున్నానని చెబుతూ  కోరాపుట్-బోలంగీర్ – కలహండి, బుందేల్ ఖండ్ లకు ప్రకటించినట్లుగా ఉత్తరాంధ్రకు కూడా , అర్టికల్ 46(3) కింద ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించాలని  ఆయన కోరారు.

 

ఇలాగే ఏడు సంవత్సారాల పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఆదాయపు పన్ను, ఎక్సైజ్ పన్నులకు మినహాయింపు ఇవ్వాలని, ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా ఉత్తరాంధ్రకు అటానమస్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని, విశాఖనువెంటనే రైల్వేజోన్ గా ప్రకటించాలని, విభజన చట్టం లో పేర్కొన్నట్లుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, విశాఖలోని విఐఎంఎస్ ను ఎఐఐఎంఎస్ గా మార్చాలని, పోలవరం ప్రాజక్టులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలుతీసుకోవాలని రామకృష్ణ కోరారు.

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరాకరించడాన్ని ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్ సమస్యలకు ప్రత్యేక హోదా మాత్రమే పరిష్కారమని,  ఈ మధ్య కేంద్రం ప్రకటించినట్లు చె బుతున్న  ప్రత్యేక ప్యాకేజీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా ఆయన ప్రధాని దృష్టికి తెచ్చారు.

 

 

click me!