కెటిఆర్ జోక్యం వల్లే ప్రొఫెసర్ అరెస్ట్

Published : Nov 14, 2016, 08:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కెటిఆర్ జోక్యం వల్లే ప్రొఫెసర్ అరెస్ట్

సారాంశం

తెలంగాణాకు చెందిన ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ జోక్యం చేసుకోవటంతో ఎట్టకేలకు ప్రొఫెసర్ ను పోలీసులు సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేసారు.

 ఎట్టకేలకు పోలీసులు ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేసారు. గుంటూరు మెడికల్ కళాశాల వైద్య విద్యార్ధిని ఆత్మహత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ ను 23 రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్  చేసారు.

వైద్య విద్యార్ధిని సంధ్యారాణి పోయిన నెలలో ఆత్మహత్య చేసుకున్నది. తన చావుకు ప్రొఫెసర్ వేధింపులే కారణమంటూ ఓ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నది. దాంతో కళాశాల మొత్తం ఆందోళన బాట పట్టింది. సంధ్యారాణి ఆత్మహత్య తర్వాత ప్రొఫెసర్ మీద అప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆరోపణలు  ఒక్కసారిగా బయటపడ్డాయి.

 ప్రొఫెసర్ ను వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్ తో సహచర మెడికోలు ఎంత ఆందోళన చేసినా మొదట్లో ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే మెడికోల ఆందోళన నానాటికీ పెరుగుతున్న కారణంతో చివరకు ప్రొఫెసర్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వైద్యశాఖ మంత్రి కామానేని శ్రీనివాస్ ప్రకటించారు. అంతే కానీ ప్రొఫెసర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పలేదు.

  దాంతో విద్యార్ధుల ఆందోళన మరింత పెరిగింది. దాంతో ఆత్మహత్యపైనా, ప్రొఫెసర్ పై వస్తున్న ఆరోపణలపైన విచారణ కమిటిని వేసింది. మొత్తం వ్యవహారాన్ని విచారించిన కమిటి ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే విద్యార్ధిని ఆత్మహత్య  చేసుకున్నట్లు నివేదిక సమర్పించినట్లు సమాచారం. దాంతో నివేదిక ఆధారంగా ప్రొఫెసర్  పై పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే, ఇంత వరకూ అరెస్ట్ చేయలేకపోయారు. ఏమంటే లక్ష్మి ఎక్కడుందో తెలియటం లేదని చెప్పారు.

చివరకు న్యాయస్ధానం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆమె ఆచూకీ కోసం 8 పోలీసు బృందాలు వెతుకులాట మొదలుపెట్టాయి. ఇంతలో ప్రొఫెసర్ ను అరెస్ట్ చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దాంతో తెలంగాణాకు చెందిన ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ జోక్యం చేసుకోవటంతో ఎట్టకేలకు ప్రొఫెసర్ ను పోలీసులు సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేసారు. ప్రొఫెసర్ ను అరెస్టు చేయటానికే ఇన్ని రోజులు పడితే, ఇక కేసు ఎప్పటికి విచారణకు వచ్చేను? ఎప్పటికి తెమిలేను? ప్రొఫెసర్ కు అసలు శిక్ష పడుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

PREV
click me!

Recommended Stories

Weather Report: గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే, మ‌రింత పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. పూర్తిగా త‌గ్గేది ఎప్పుడంటే?
KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu