Telangana Congress : రేవంత్ కు సీఎం పదవి... మరి టిపిసిసి చీఫ్ బాధ్యతలు ఆయనకేనా?

By Arun Kumar P  |  First Published Dec 6, 2023, 12:15 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది క్లారిటీ వచ్చింది. రేవంత్ రెడ్డికే సీఎం పదవి దక్కడంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కనుందోనన్న చర్చ మొదలయ్యింది.


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యింది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఖరారయ్యారు... కాబట్టి మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం, రేవంత్ రెడ్డి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవిని ఆశించిన వారికి కీలక శాఖలు అప్పగించడంతో పాటు పార్టీ పదవుల్లోనూ వారికి కేటాయించాలని అదిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇలా నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అటు ప్రభుత్వంలోనూ... ఇటు పార్టీలోనూ కీలక బాధ్యతలు దక్కే అవకశాలున్నట్లు తెలుస్తోంది.  

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలుంటే 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీలోని కీలక నాయకుల్లో చాలామంది ఇదే జిల్లా నుండి విజయం సాధించారు. వారిలో ఒకరయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అదిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన మంత్రిత్వ శాఖతో పాటు పిసిసి అధ్యక్ష పదవికూడా వెంకట్ రెడ్డికి అప్పగించే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

Latest Videos

ఇక ఇదే నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ కేబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖ దక్కే అవకాశాలున్నాయి. అలాగే వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా నల్గొండ జిల్లానుండి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ ముగ్గురు సీనియర్లకు కేబినెట్ లో చోటు కల్పించాలని ఇప్పటికే రేవంత్ కు కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. 

CM aRevanth Reddy : రేవంత్ గట్టోడే... అంతటి సీనియర్ తో సాధ్యంకానిది సాధించి చూపించాడు...

ఇదిలావుంటే ముఖ్యమంత్రి పదవిని ఆశించిన దళిత నేత  మల్లు భట్టివిక్రమార్క కు కూడా రేవంత్ ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కనుంది. ఆయనను డిప్యూటీ సీఎంగా నియమించడంతో పాటు ఏదయినా కీలక మంత్రిత్వ శాఖను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా దళిత వర్గం నుండి మాత్రమే కాదు బిసి, ఎస్టీ సామాజికవర్గాల నుండి  కూడి ఉపముఖ్యమంత్రులను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇలా పొన్నం ప్రభాకర్, సీతక్క లకు కూడా డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 

click me!