Telangana Group-2 Exam : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన గ్రూప్-2 పరీక్ష వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నిర్వహించనున్నారు. దీని కోసం ఏర్పాట్లు చేయాలని టీఎస్ పీఎస్సీ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
TSPSC Group-2 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తోంది. ఆయా జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను గుర్తించి తమకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
Revanth Reddy Assets : రేవంత్ రెడ్డి మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా ?
undefined
ముఖ్యంగా సీసీ కెమెరాలు ఉన్న కేంద్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని టీఎస్ పీఎస్సీ కలెక్టర్లకు సూచించింది. ముఖ్యంగా రహస్య సామగ్రిని తెరిచి పంపిణీ చేసే చీఫ్ సూపరింటెండెంట్ గదిలో కచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలని పేర్కొంది. ఒక్కో అభ్యర్థికి సుమారు 2 చదరపు మీటర్ల స్థలంతో వరుసల్లో సీట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది. అలాగే చివరి గది మినహా ఒక్కో గదికి 24 లేదా 48 మంది అభ్యర్థులు ఉండేలా చూడాలని చెప్పింది.
రేవంత్ రెడ్డి కూతురిని చూశారా?
కాగా.. ఈ ఏడాది నవంబర్ 2, 3 తేదీల్లో రిక్రూట్ మెంట్ టెస్ట్ నిర్వహించాలని కమిషన్ తొలుత నిర్ణయించింది. అయితే పరీక్ష నిర్వహణకు అవసరమైన కీలకమైన పరిపాలన, పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో అసెంబ్లీ ఎన్నికల కారణంగా 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేశారు. సాధారణ పరిపాలన శాఖలో 165 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, 126 మండల పంచాయతీ అధికారులు, భూపరిపాలన శాఖలో 98 నాయబ్ తహసీల్దార్లు, 97 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు సహా మొత్తం 783 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్-2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పరీక్ష కోసం 5,51,943 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, ఒక్కో ఖాళీకి 700 మంది పోటీ పడుతున్నారు. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్-1, పేపర్-2- హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్-3- ఎకానమీ అండ్ డెవలప్మెంట్, పేపర్-4-తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో 600 మార్కులకు నిర్వహించనున్నారు.