Revanth Reddy: కొత్త శకాన్ని నిర్మిద్దామని భట్టి, కోమటిరెడ్డి పిక్.. రేవంత్ కనిపించట్లేదు ఏంటబ్బా!?

By Mahesh K  |  First Published Dec 30, 2023, 8:37 PM IST

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విట్టర్‌లో ఓ ఫొటో షేర్ చేశారు. అందులో భట్టి, వెంకట్ రెడ్డి మాత్రమే ఉన్నారు. నవ శకాన్ని నిర్మిద్దాం అనే స్లోగన్ వెనుక వైపున ఉన్నది. వీరిద్దరూ క్యాబినెట్‌లో ఉన్నప్పటికీ సీఎం ఆ ఫొటోలో లేకుండానే నవ శకాన్ని నిర్మిద్దామనే కామెంట్ పెట్టడం చర్చనీయాంశమైంది.
 


Bhatti: తెలంగాణ కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని మాసాలకు ముందు వరకు పెద్దగా జోష్‌లో కనిపించలేదు. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పార్టీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి తమకే వస్తుందని ఆశపడ్డారు కూడా. కానీ, తమకంటే జూనియర్, అదీ పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. గెలిచే అవకాశాలు కనిపిస్తున్నా.. సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని చీఫ్‌గా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడలేదు. సీనియర్ నేతలూ బాహాటంగానే ఆయనపై కామెంట్లు చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. అదే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. సీనియర్లను మంత్రి పదవులతో అధిష్టానం సరిపుచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను కూడా ధీటుగా ఎదుర్కొంటున్నది. అంతా సవ్యంగానే సాగుతున్నదనే అభిప్రాయం బలపడుతున్న తరుణంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ఫొటో చర్చనీయాంశమైంది.

Latest Videos

కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం అనే ట్యాగ్ లైన్ వెనుక వైపున ఉన్న ఫొటోలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో వెంకట్‌రెడ్డి నిలిచి ఉన్నారు. ఈ ఫొటోను వెంకట్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.

Also Read: TDP: ఏపీలో తెలంగాణ ట్రెండ్.. చంద్రబాబు, పవన్ రెండు స్థానాల్లో పోటీ? అల్లుడి కోసం సీటు త్యాగం!

దీంతో ఈ ఫొటోలో సీఎం రేవంత్ రెడ్డి కనిపించట్లేదేంటబ్బా అనే కామెంట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని సీఎంగా కూడా యాక్సెప్ట్ చేయడం లేదా? అనే సందేహాలు వస్తున్నాయి.

నిజానికి దూకుడుగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎంగా చేసినప్పటికీ ఆచితూచి వ్యవహరించేలా భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని అధిష్టానం కట్టబెట్టింది. అందులోనూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన శాఖలు ఫైనాన్స్, ప్లానింగ్, ఎనర్జీలకు బాధ్యతలు వహిస్తున్నారు. ఆర్థికంతోపాటు విద్యుత్ శాఖలు ఇప్పుడు కీలకమైనవి. వీటిని భట్టి పర్యవేక్షిస్తున్నారు. తద్వార సీనియర్లకూ ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. 

click me!