తెలంగాణ ఉద్యమంలో భాగంగా సర్కారు తీరుకు నిరసనగా డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను ఉద్యమబాట వదిలి ఆధ్యాత్మిక మార్గం పట్టినట్టు వివరించారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కాలంలో ఎందరో ఉద్యమకారులు ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు. అనేకులు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా కొలువులను వదిలి ప్రజా ఉద్యమంతో మమేకం అయ్యారు. ఈ మహాయజ్ఞంలో అప్పుడు డీఎస్పీగా పని చేస్తున్న నళిని కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. ఆమె తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత చాలా మంది తమ ఉద్యోగాల్లో తిరిగి చేరారు. కానీ, నళిని మాత్రం తన ఉద్యోగంలో చేరలేదు. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇలాంటి ఉద్యమకారులను ప్రస్తావించారు.
నళినిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని పోలీసు శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆమెను తిరిగి తీసుకోవడంలో అడ్డంకులేమున్నాయని? ఆమె ఒక వేళ తనను కలవాలని అనుకుంటే అందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ వార్త బయటకు రాగానే నళిని స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆఫర్‌ను ఆమె నిరాకరించారు. తనకు ఉద్యోగం అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఆయనను కలిశారు. రాజధాని నగరం హైదరాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
Also Read: Pawan Kalyan: ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ సంచలన లేఖ.. పొత్తు పొడవడానికేనా?
సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తనకు సంతోషంగా ఉన్నదని, అయితే, ఇప్పుడు తనకు ఉద్యోగం అవసరం లేదని నళిని పునరుద్ఘాటించారు. తాను డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డారని, ఇప్పుడు తనది ఆధ్యాత్మిక మార్గం అని వివరించారు. తాను సీఎంను వేద కేంద్రాల కోసం ప్రభుత్వ సహకారాన్ని అడిగినట్టు తెలిపారు. తన విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
మాజీ డీఎస్పీ శ్రీమతి నళిని ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన… pic.twitter.com/wjOxp91ltN
— Telangana CMO (@TelanganaCMO)తాను వేదం, యజ్ఞం పుస్తకాలను పూర్తి చేస్తున్నారని, సనాతన ధర్మ ప్రచారానికి పని చేస్తున్నట్టు నళిని వివరించారు. అయితే.. గతంలో తాను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలపై రిపోర్ట్ ఇచ్చానని వివరించారు. తనలా ఎవరూ బాధపడొద్దని పేర్కొన్నారు. బ్యూరోక్రసీ మీద తనకు నమ్మకం పోయిందని, అందుకే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నట్టు వివరించారు.