నన్ను కూడా పార్టీ నుండి పంపే ప్రయత్నం: రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం

By narsimha lodeFirst Published Aug 5, 2022, 4:30 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.తనను కూడా పార్టీ నుండి పంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేశారన్నారు. 
 

న్యూఢిల్లీ: తనను  కూడా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.తనను సంప్రదించకుండానే చండూరులో ఇవాళ సభ ఏర్పాటు చేశారని భువనగిరి ఎంపీ komatireddy Venkat Reddy చెప్పారు. తనకు తెలియకుండానే తనను ఓడించేందుకు యత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకున్నారని  వెంకట్ రెడ్డి మండిపడ్డారు. హుజూరాబాద్  ఉప ఎన్నికల్లో బీజేపీ సహకరించేలా Revanth Reddy  వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేశారు. 

శుక్రవారం నాడు న్యూఢిల్లీలో Bhuvananagiri MP  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 34 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ పదవి, మూడేళ్ల క్రితం వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవా అని ఆయన ఆవేశంగా ప్రశ్నించారు.  దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ ను ఎందుకు వీడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. పాతకాంగ్రెస్ నేతలను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరూ ఎటు పోయినా కానీ తాను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టా, కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్నారు.  ఈ రకంగా తనుకు తెలియకుండానే  సభలు, సమావేశాలు నిర్వహిస్తే  సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనే తేల్చుకొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు.

గత ఏడాది జూలై 2న Etela Rajender  రాజీనామాను స్పీకర్ ఆమోదించారన్నారు. జూన్ 26న రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమించారన్నారు. జూలై 7న మంచి రోజు ఉందని  రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.  Huzurabad అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైందన్నారు. నవంబర్ లో పోలింగ్ జరిగిందన్నారు. ఈ ఐదు మాసాల కాలంలో అవసరం లేని చోట్ల దళిత దండోరాలు నిర్వహించారని రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి విమర్శలు చేశారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నిక  కోసం ఆనాడు రేవంత్ రెడ్డి ఎందకు ప్లాన్  చేయలేదో చెప్పాలన్నారు. హుజూరాబాద్ లో అభ్యర్ధి ఎవరైతే బాగుంటుందనే విషయమై స్థానికంగా ఉన్న నేతలతో ఎందుకు చర్చించలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.దళిత దండోరా సభలను హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు నిర్వహించలేదని అడిగారు. ఉప ఎన్నికకు ప్లాన్ చేయకుండా అవసరం లేని చోట సభలు పెట్టారన్నారు. 

 హుజూరాబాద్ లో నామినేషన్ల చివరి రోజున అభ్యర్ధిని నిర్ణయించారన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని హుజూరాబాద్ లో ఎలా అభ్యర్ధిగా బరిలోకి దింపారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపారన్నారు.  కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక పరోక్షంగా బీజేపీకి సహకరించేలా ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల సమయంలో BJP తో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే మీరు ఎలా అన్వయించుకొంటారో అన్వయించుకోవాలన్నారు. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామా ఇంకా ఆమోదించలేదన్నారు. ఇవాళ పార్లమెంట్  కు సెలవు కూడా లేదన్నారు. ఇవాళ తనకు మూడు ముఖ్యమైన సమావేశాలు ఉన్న విషయం తెలిసి చండూర,లో సభను ఏర్పాటు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఆరోపించారు. మనుగోడు సమావేశానికి తాను హాజరుకాకపోతే  ఆ తర్వాత తనను అప్రదిష్టపాల్జేయవచ్చనే అభిప్రాయంతో ఇవాళ చండూరులో సమావేశం ఏర్పాటు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా తనను ఓడించేందుకు పనిచేసిన చెరుకు సుధాకర్ ను మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్పించారని రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులతో కలిసి తాను చండూరు సభలో ఎలా పాల్గొనాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. చైతన్యవంతులైన నల్గొం జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.తనను సంప్రదించకుండానే తన పార్లమెంట్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసిందన్నారు. అంతేకాదు తన పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీలో చేర్చుకొనే సమయంలో తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

also read:అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ

 తెలంగాణ కోసం విద్యార్ధులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవడంతో ఆవేదనతో మంత్రి పదవికి కూడా తాను రాజీనామా చేసినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గర్తు చేశారు. పార్టీ మారాలనుకొంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెళ్తానని  వెంకట్ రెడ్డి చెప్పారు. తాను బీజేపీలో చేరుతానని ఎలా ప్రసారం చేస్తారని ఆయన కొందరు మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.పదవుల కోసం తాను పార్టీ మారే వ్యక్తిని కానన్నారు. అమిత్ షా వద్ద రాష్ట్ర రాజకీయాల గురించి ఎలాంటి చర్చ జరగలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఏదైనా ప్రజల కోసం చేయాలన్నారు. 

click me!