సోనియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ: మతలబు ఏమిటి?

By narsimha lodeFirst Published Mar 12, 2020, 1:54 PM IST
Highlights

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  గురువారం నాడు ఉదయం కాంగ్రెస్ పార్టీ చీప్ సోనియా‌గాంధీతో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పేరు  ప్రధానంగా విన్పిస్తోంది

న్యూఢిల్లీ: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  గురువారం నాడు ఉదయం కాంగ్రెస్ పార్టీ చీప్ సోనియా‌గాంధీతో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పేరు  ప్రధానంగా విన్పిస్తోంది.ఈ తరుణంలో ఆయన సోనియాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. 

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం  కాంగ్రెస్  పార్టీ  సీనియర్ల మధ్య తీవ్రమైన పోటీ  సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఈ పదవి నుండి  తప్పుకొంటానని ప్రకటించారు.

Also read:కారణమిదే: రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్ల అసంతృప్తి

దీంతో  పీసీసీ చీఫ్ పదవి కోసం  కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, వి.హనుమంతరావు తదితరులు పోటీ పడుతున్నారు. 

ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను  ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది.  గురువారం నాడు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సోనియాగాంధీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. 

సుమారు గంట సేపటికి పైగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి   సోనియాగాంధీతో సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టిని బలోపేతం చేసే విషయమై చర్చించినట్టుగా   కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.  

తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే  విషయమై తన ఆలోచనలను కోమటిరెడ్డి పార్టీ అధినేత్రితో చర్చించారు. పార్టీని బలోపేతం చేసే విషయమై  కూడ  వీరిద్దరి మధ్య చర్చించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాకు వివరించారు.   
 

click me!