మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక ఖాయం..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Published : Jul 30, 2022, 12:31 PM IST
మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక ఖాయం..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొద్ది రోజులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌ మారింది. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే సంకేతాల నేపథ్యంలో.. ఆయనను బుజ్జగింపుల  పర్వం  కొనసాగుతుంది. 

తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొద్ది రోజులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌ మారింది. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే సంకేతాల నేపథ్యంలో.. ఆయనను బుజ్జగింపుల  పర్వం  కొనసాగుతుంది. శనివారం ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలు.. రాజగోపాల్‌ రెడ్డితో వేర్వురుగా భేటీ అయ్యారు. రాహుల్‌తో మాట్లాడేందుకు ఢిల్లీ రావాలని వారు రాజగోపాల్ రెడ్డిని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ చర్చలు కూడా విఫలమైనట్టుగానే  సమాచారం. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి.. పార్టీ మార్పుపై చర్చించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. 

కేసీఆర్‌పై ధర్మ యుద్దం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక ఖాయమని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో మార్పుకు నాంది అవుతుందని భావిస్తున్నట్టుగా తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పారు. ఇక, పార్టీ మార్పు, ఉప ఎన్నికపై 15 రోజుల్లో రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మీడియాతో మాట్లాడిన అనంతరం రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ బయలుదేరి వెళ్లారు. 

Also Read: కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం.. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ..

మరోవైపు గత కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్‌ను వీడనున్నాననే సంకేతాలు పంపిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి రావాలని కోరిన కూడా ఆయన ఇష్టపడటం లేదు. టీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు వేస్తున్న అడుగుల్లో రాజీపడేది లేదని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, అతని కుటుంబం అవినీతి చేసి.. భారీగా సంపదను కూడబెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. ఇందుకు వ్యతిరేకంగా తాను పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. 

అయితే తాను బీజేపీలో చేరతానని చెప్పలేదని.. వచ్చే ఎన్నికలు పాండవులు, కౌరవుల మధ్యే జరుగుతాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎం, ఆయన డబ్బు పంచే సైన్యం ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీలో చేరాలన్న తన నిర్ణయాన్ని ఆయన అనుచరులు ఆమోదించారని అంతకుముందు రాజగోపాల్ పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్