
నల్గొండ : అనుమానం పచ్చని కాపురం లో చిచ్చు రేపింది. భార్య మరొకరితో సఖ్యతగా మెరుగైందని అనుమానించిన భర్త ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు పురుగుల మందు తాగడు. నకిరేకల్లో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్ (29)కి ఇదే మండలం పాలెం గ్రామానికి చెందిన స్వాతితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీకాంత్ ప్లంబర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
నకరేకల్ లోని పన్నాల గూడెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏడాదికాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో గొడవలు జరుగుతున్నాయి. ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత దంపతులు గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీకాంత్ భార్య swathi (27)ను గదిలోనే దిండుతో అదిమి, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నకిరేకల్ లోనే ఉంటున్న స్వాతి అక్క పల్లా స్వప్నకు శ్రీకాంత్ ఫోన్ చేసి మీ చెల్లిని చంపేశానని సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
భార్యపై స్నేహితులతో కలిసి భర్త సామూహిక అత్యాచారం..కట్నం ఇవ్వలేదనే దారుణం..
భార్యను హత్య చేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీకాంత్ పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత తానే స్వయంగా స్థానిక ఆసుపత్రికి వెళ్ళాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు అతడిని నల్గొండ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు.హత్య స్థలాన్ని నకిరేకల్ సిఐ వెంకటయ్య పరిశీలించారు. స్వాతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరి స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ వెంకటయ్య తెలిపారు.
ఇదిలా ఉండగా, అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ కిరాతకుడు తన స్నేహితులతో కలిసి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య మీదే సామూహిక అత్యాచారం చేశాడు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ మేరకు బాధిత మహిళ కుటుంబ సభ్యులు.. ఆమె భర్త, అతని స్నేహితుల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం 2020 మార్చి 6న ఆమెకు నిందితుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను భర్త, ఆడపడుచు రెండు లక్షల రూపాయలు, కారు కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారు.
అయితే, అడిగినంత డబ్బు కారు ఇవ్వలేక పోవటం వల్ల ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఒక రోజు ఆమె భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకువచ్చాడు. నలుగురు కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాని చంపేసి, పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సైతం ప్రయత్నించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని.. నేరస్థులకు కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మ్రిగాంక్ పతాక్ తెలిపారు.