ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Siva Kodati |  
Published : Aug 05, 2022, 04:43 PM ISTUpdated : Aug 05, 2022, 05:00 PM IST
ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సారాంశం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ రోజున తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఢిల్లీలో శుక్రవారం అమిత్ షాను కలిసిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తాను రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అమిత్ షా తనను పార్టీలోకి ఆహ్వానించారని.. రాజీనామా లేఖ ఇవ్వడానికి స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పారు. మునుగోడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. 

బహిరంగ సభ పెట్టే బీజేపీలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ లేకున్నా.. అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ ఇస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయిత్ షా సమక్షంలో తనతో పాటు మరికొందరు బీజేపీలో చేరతారని ఆయన వెల్లడించారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిస్తారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 8న స్పీకర్ లేకుండా.. అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ ఇస్తానని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో వెంకటరెడ్డి కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటరెడ్డి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?