రేవంత్ సైన్యం దొంగల ముఠా.. పెద్ద పెద్ద నాయకులు బీజేపీలో చేరతారు: రాజగోపాల్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Aug 6, 2022, 1:09 PM IST
Highlights

ఈ నెల 21న బీజేపీలో చేరబోతున్నట్టుగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆ రోజున జరిగే బహిరంగ సభలో దాసోజ్ శ్రవణ్‌తో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు బీజేపీలో చేరతారని చెప్పారు. మునుగోడులో జాయినింగ్ సభ నిర్వహించే అవకాశం ఉందన్నారు.

ఈ నెల 21న బీజేపీలో చేరబోతున్నట్టుగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆ రోజున జరిగే బహిరంగ సభలో దాసోజ్ శ్రవణ్‌తో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు బీజేపీలో చేరతారని చెప్పారు. మునుగోడులో జాయినింగ్ సభ నిర్వహించే అవకాశం ఉందన్నారు. సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని అన్నారు. నేడు ఢిల్లీలోరాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను అమిత్ షాను కలిసిన తర్వాత చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినప్పుడు ఎవరూ ఏం మాట్లాడలేదని చెప్పారు. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళితే పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని తెలిపారు. 

తాను పార్టీకి దూరంగా మునుగోడు ప్రజా సమస్యలపై పోరాటం కొసాగించానని చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ వైపు అడుగులే వేశానని తెలిపారు. నైతిక విలువలు పాటించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారేందుకు సిద్దమయ్యానని  చెప్పారు.  కాంగ్రెస్ పార్టీలో అవమానాలు భరించలేక.. ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని తమ నెత్తిమీద పెట్టడం సహించలేక బయటకు వస్తున్నానని చెప్పారు. డబ్బులు ఇచ్చి పీసీపీ పదవి తెచ్చుకన్న వ్యక్తి కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడాలా? అని ప్రశ్నించారు. రేవంత్ ఏం పొడిచారని..?, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాడా?.. అని ప్రశ్నల వర్షం కురిపించారు.  

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందన్నారు. మోదీ, అమిత్ షా నాయకత్వంలో పనిచేసేందకు పిలుపువచ్చిందన్నారు. ప్రజల కోసం, అభివృద్ది కోసం, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం ప్రజస్వామ్యబద్దంగా బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ది కోసం నిధులు ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగాను.. కానీ పట్టించుకోలేదని చెప్పారు. సీఎం కేసీఆర్.. అపాయింట్‌మెంట్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దొరకదని అన్నారు. 

కాంగ్రెస్‌లో ఎంతమంది సీనియర్లు ఉన్నా.. పీసీసీ పోస్టు రేవంత్‌కే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు. రేవంత్, ఆయన సైన్యం దొంగల ముఠాగా మారి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. నా సొంత డబ్బులతోనే నియోజవర్గంలో వేల మందిని ఆదుకున్నానని తెలిపారు. మునుగోడులో ప్రజల సమస్యల పరిష్కారానికే రాజీనామా చేశానని చెప్పారు.  తెలంగా కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు. 

వ్యాపారాలు, కాంట్రాక్ట్‌లే ముఖ్యం అయితే టీఆర్ఎస్‌లో చేరేవాళ్లమని చెప్పారు. తెలంగాణలో అప్పులు చేసి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. అలాంటి పరిస్థితి పోవాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు.  తాను ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని విమర్శించనని చెప్పారు. 

click me!