సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్.. వాటిపై స్పందిస్తారా..?

Published : Aug 06, 2022, 12:53 PM IST
సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్.. వాటిపై స్పందిస్తారా..?

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో ప్రెస్‌ మీట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో ప్రెస్‌ మీట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్.. ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, ఆ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్‌, ఈడీ దాడుల వార్తలపై.. కేసీఆర్ కౌంటర్ ఎటాక్‌ చేసే అవకాశం ఉందనే తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక, బీజేపీలో చేరికలు, రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న కామెంట్స్‌పై కేసీఆర్ స్పందించే అవకాశం ఉందనే సమాచారం అందుతుంది. 

చీకోటి ప్రవీణ్‌కు సంబంధించి వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు, టీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉన్నట్టుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈడీ నోటీసులు అందాయని కూడా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని.. టీఆర్ఎస్‌ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలు ఉంటాయిన చెబుతూ వస్తున్నారు. ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇతర పార్టీలకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Renu Desai Fire on Media: మీడియా పైరెచ్చిపోయిన రేణు దేశాయ్ | Asianet News Telugu
Renu Desai Strong Comments On Street Dogs: కుక్కల మరణాలపై రేణు దేశాయ్ ఉగ్రరూపం | Asianet News Telugu