సోనియాను బలిదేవతన్నాడు.. బ్లాక్‌మెయిలింగ్‌తో కోట్లు , డబ్బులిచ్చి పీసీసీ పోస్ట్‌: రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి

By Siva KodatiFirst Published Aug 2, 2022, 10:31 PM IST
Highlights

తనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏ వ్యాపారం చేయకుండా రేవంత్‌కు కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని కోమటిరెడ్డి నిలదీశారు. రేవంత్ బ్లాక్ మెయిల్ చేసి సంపాదించాడని అందరికీ తెలుసునంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

తనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు సోనియా గాంధీని తెలంగాణ తల్లి అంటోన్న రేవంత్ రెడ్డి ఆమెను గతంలో బలిదేవత అని వ్యాఖ్యానించారంటూ చురకలు వేశారు. ఏ వ్యాపారం చేయకుండా రేవంత్‌కు కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని కోమటిరెడ్డి నిలదీశారు. రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టి పీసీసీ తెచ్చుకున్నాడని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు సీఎం అయ్యి దోచుకోవాలని చూస్తున్నాడని కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ బ్లాక్ మెయిల్ చేసి సంపాదించాడని అందరికీ తెలుసునంటూ ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ బ్రాండ్ బ్లాక్ మైలర్ అని కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. 4 పార్టీలు మారి వచ్చింది రేవంత్ అంటూ రాజగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. తాను రేవంత్ పీసీసీ పదవికి మద్ధతు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. 

Also REad:సోనియాను హింసిస్తుంటే.. అమిత్ షాతో బేరసారాలు, తేనేపూసిన కత్తి : రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ వ్యాఖ్యలు

అంతకుముందు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోనియాపై ప్రేమ వుందని, కాంగ్రెస్‌పై గౌరవం వుందని కొందరు తేనేపూసిన కత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విసిరిన ఎంగిలి మెతుకులకు కొందరు ఆశపడ్డారని.. సోనియాను ఈడీ పిలిచిన రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతుంటే, కొందరు మాత్రం అమిత్ షా దగ్గర కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని రేవంత్ ఆరోపించారు. సోనియాకు అవమానం జరిగితే.. మోడీ, అమిత్ షాలపై పోరాటం చేయాల్సిన సమయంలో కుక్క బిస్కెట్ల కోసం విశ్వాసఘాతుకులుగా మారారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారిని తెలంగాణ సమాజం క్షమించదని రేవంత్ హెచ్చరించారు. పార్టీకి నష్టం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పదవులు ఇవ్వకుంటే.. మీరు బ్రాందీ షాపుల్లో పనిచేయడానికి పనికిరారని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలను, పదవులను ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే వుంటారని రేవంత్ తెలిపారు. అమిత్ షాను కలిసినప్పుడే కాంగ్రెస్‌తో పేగు బంధం తెగిపోయిందన్నారు. సోనియాను ఈడీ హింసిస్తున్నప్పుడు శత్రువు పక్కన చేరడం దుర్మార్గమని రేవంత్ దుయ్యబట్టారు. మునుగోడు ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ రెడీగా వుందన్నారు. ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ సిద్ధంగా వుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోతామని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ చీఫ్‌గా ఎంపిక కావడానికి రాజగోపాల్ రెడ్డి సహకరించారని ఆయన అన్నారు. 
 

click me!