సోనియాను హింసిస్తుంటే.. అమిత్ షాతో బేరసారాలు, తేనేపూసిన కత్తి : రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 02, 2022, 09:42 PM ISTUpdated : Aug 02, 2022, 10:23 PM IST
సోనియాను హింసిస్తుంటే.. అమిత్ షాతో బేరసారాలు, తేనేపూసిన కత్తి : రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ వ్యాఖ్యలు

సారాంశం

మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పదవులు ఇవ్వకుంటే.. మీరు బ్రాందీ షాపుల్లో పనిచేయడానికి పనికిరారని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలను, పదవులను ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. 

మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోనియాపై ప్రేమ వుందని, కాంగ్రెస్‌పై గౌరవం వుందని కొందరు తేనేపూసిన కత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విసిరిన ఎంగిలి మెతుకులకు కొందరు ఆశపడ్డారని.. సోనియాను ఈడీ పిలిచిన రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతుంటే, కొందరు మాత్రం అమిత్ షా దగ్గర కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని రేవంత్ ఆరోపించారు. సోనియాకు అవమానం జరిగితే.. మోడీ, అమిత్ షాలపై పోరాటం చేయాల్సిన సమయంలో కుక్క బిస్కెట్ల కోసం విశ్వాసఘాతుకులుగా మారారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారిని తెలంగాణ సమాజం క్షమించదని రేవంత్ హెచ్చరించారు. పార్టీకి నష్టం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పదవులు ఇవ్వకుంటే.. మీరు బ్రాందీ షాపుల్లో పనిచేయడానికి పనికిరారని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలను, పదవులను ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే వుంటారని రేవంత్ తెలిపారు. అమిత్ షాను కలిసినప్పుడే కాంగ్రెస్‌తో పేగు బంధం తెగిపోయిందన్నారు. సోనియాను ఈడీ హింసిస్తున్నప్పుడు శత్రువు పక్కన చేరడం దుర్మార్గమని రేవంత్ దుయ్యబట్టారు. మునుగోడు ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ రెడీగా వుందన్నారు. ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ సిద్ధంగా వుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోతామని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ చీఫ్‌గా ఎంపిక కావడానికి రాజగోపాల్ రెడ్డి సహకరించారని ఆయన అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే