ఉత్తమ్ కొనసాగితే ఎన్నికల్లో పోటీ చేయనంటున్న కోమటిరెడ్డి

First Published Sep 12, 2017, 1:07 PM IST
Highlights
  • ఉత్తమ్ కొనసాగితే ఎన్నికల్లో పోటీ చేయను
  • మాకు నాయకత్వం ఇవ్వాలి లేదా తెలంగాణా యోధులెవరికైనా పర్వాలేదు
  • బిజెపిలోకి వెళ్తామన్నది ఉత్తమ్ చేయిస్తున్న ప్రచారం

నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి పట్టుపట్టు వదలనంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీచ్యుతిని చేసేదాకా వదలిపెట్టనని ఆయన అంటున్నారు. ఈ విషయాన్ని ఒక టివితో మాట్లాడుతూ జంకు గొంకు లేకుండా చెప్పారు. పిసిసి అధ్యక్షుడి గా ఉత్తమ్ కొనసాగుతారని కుంతియా స్పష్టం చేసినట్లు మీడియా లో వచ్చిన వార్తల మీద తాను ఎఐసిసి రాష్ట్ర ఇన్ చార్జ్ రామచంద్రకుంతియాతో వాకబు చేసినట్లు కూడా ఆయన చెప్పారు. ‘‘ఉత్తమ్‌ కొనసాగుతారని తాను చెప్పలేదని కుంతియా చెప్పారు,’ అని కోమటిరెడ్డి అన్నారు.
‘‘పీసీసీ చీఫ్‌గా మాకు ఒక ఏడాది అవకాశం ఇచ్చి చూడాలి, మాకు ఇవ్వకపోతే తెలంగాణ కోసం ఉద్యమించిన వారికైనా ఇవ్వాలి, ఎవరికిస్తే బాగుంటుందో హైకమాండ్ సర్వే చేయించాలి, ఉత్తమ్ కొనసాగితే ఎన్నికల్లో పోటీ చేయను,  ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేసుకుంటా, సమయం వచ్చినప్పుడు మళ్లీ రంగంలోకి దిగుతా’’నని కోమటిరెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ వీడుతామనే ప్రచారాని ఖండిస్తూ ఇదంతా  ఉత్తమ్‌ కుమార్ రెడ్డి  చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
బయటకు ఎందుకు పోతాను, పార్టీలో ఉండే కొట్లాడుతానని అన్నారు. 
‘‘ ఉత్తమ్ ను మార్చాలన్నది  నా ఆలోచనకాదు. నా ఆలోచనతో నేను మాట్లాడటం లేదు. పార్టీ కార్యకర్తలు, నేతల అభిప్రాయమే చెబుతున్నాను. ఫంక్షన్‌హాల్ మీటింగ్‌లతో అధికారం రాదు.. పాదయాత్రతో జనంలోకి వెళ్లాలి,’ అన్ని హితవు చేశారు.
 ఉత్తమ్ నాయకత్వంలో ఫలితాలు రాలేదని అంటూ  గుత్తా రాజీనామా చేస్తాడని తాను  నమ్మడం లేదని అన్నారు.

 

మరిన్ని తాజా వార్తలు ఇక్కడ చూడండి

click me!