కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో గందరగోళం: రేవంత్ ప్రసంగిస్తుండగా కోమటిరెడ్డి వర్గీయుల ఆందోళన

By narsimha lodeFirst Published Nov 9, 2021, 12:30 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతుల సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది. రెండు రోజుల పాటు హైద్రాబాద్ కొంపల్లిలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహించారు.పాసులు రాలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు ఆందోళన చేశారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతుల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో గందరగోళం చోటు చేసుకొంది.  పొన్నాల లక్ష్మయ్య వర్గీయులపై భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని నిలిపివేశారు.

Hyderabad మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో  మంగళవారం నాడు Congress పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మండల, బ్లాక్‌, జిల్లా అధ్యక్షులకు ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి 1200 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

also read:కామారెడ్డి రైతు మృతిపై వివాదం: సహజ మరణమంటూ నివేదిక.. కలెక్టర్లు బానిసలంటూ కాంగ్రెస్ ఆగ్రహం

.ఈ శిక్షణ తరగతులను ప్రారంభిస్తూ టీపీసీసీ చీఫ్ Revanth Reddy ప్రసంగించారు. ఈ సమయంలో ఈ సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది.ఈ ట్రైనింగ్ క్లాసులకు హాజరైన ప్రతినిధుల్లో మండల పార్టీ అధ్యక్షులకు తెలియకుండానే పాస్ లు జారీ చేశారని  జనగామ నియోజకవర్గానికి చెందిన నేతలు చెప్పారు.జనగామ నియోజకవర్గం నుండి పొన్నాల లక్ష్మయ్య వర్గీయులకే పదవులు కట్టబెట్టారని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య వర్గీయులే పాసులు తీసుకొన్నారని వేదిక వద్ద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు నిరసనకు దిగారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులనే కారణంగానే తమకు పాస్ లు ఇవ్వలేదని ఆయన వారు ఆరోపించారు.  పార్టీ సీనియర్లు కొందరు నిరసనకారులను సర్ధిచెప్పారు.  జనగామ నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పార్టీ పదవులు ఎలా ఇచ్చారని  పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశ్నించారు.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  రానున్న రోజుల్లో ప్రతి ఆరు మాసాలకు ఓసారి కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని  రేవంత్ రెడ్డి తెలిపారు.  పార్టీ కోసం పనిచేయని నేతలకు జనవరి నుండి పార్టీ కమిటీల నుండి ఉద్వాసన పలుకుతామని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను కలుసుకొనే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ప్రసంగిస్తారు. డిజిటల్ మెంబర్​షిప్​పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, దీపక్ జాన్ ప్రసంగిస్తారు. ప్రజా చైతన్య పాదయాత్రపై ఏఐసీసీ కార్యక్రమాల ఇంఛార్జి మహేశ్వర్ రెడ్డి.... దళితులపై దాడుల గురించి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, సామాజిక న్యాయంపైన మధు యాష్కీ, నైనాల గోవర్ధన్ తదితరులు మాట్లాడతారు.రెండో రోజు షెడ్యూలునీటి పారుదల, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, వ్యవసాయం, విద్యుత్, పోడు భూములు, మైనారిటీ సంక్షేమం, ప్రస్తుత రాజకీయ అంశాలు పైన ప్రసంగాలు ఉంటాయన్నారు. రెండో రోజున ఎమ్మెల్యే సీతక్క, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ రామాంజనేయులు, కోదండరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, శ్రవణ్ దాసోజు, బలరాం నాయక్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, మన్నే సతీశ్​ తదితరులు ప్రసంగించనున్నారు.

click me!