Ration card జాబితా నుంచి కొమురయ్య పేరును తొలగించాల్సి ఉండగా అతడి భార్య కొమురమ్మ పేరును తొలగించారు. Ration riceపైనే ఆధారపడి బతికే ఆమె పేరు మార్చాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగింది.
తిమ్మాపూర్ : రెవెన్యూ అధికారులు చేసిన చిన్న పొరపాటు ఆమె పాలిట శాపంగా మారింది. పూట తిండికి ఇబ్బంది పడేలా చేసింది. వారికి అది రోజువారీ పనిలో భాగంగా దొర్లిన చిన్న తప్పే.. కానీ ఆమెకు అది జీవన్మరణ సమస్యగా మారింది. ముదిమి వయసులో రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఆమె ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది. అసలేం జరిగిందంటే..
భర్త చనిపోతే అతని పేరును రేషన్ కార్డు నుంచి తొలగించాల్సింది పోయి.. బతికున్న wife nameను తొలగించారు. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని ఆ వృద్ధురాలు గత రెండేళ్లుగా రేషన్ బియ్యానికి దూరమయ్యింది.
undefined
కోవిడ్ సమయంలో నిరుపేదల కోసం ప్రభుత్వం అందించిన ఎలాంటి సాయం ఆమెకు అందలేదు. వివరాల్లోకి వెళితే.. తిమ్మాపూర్ మండలంలోని మొగిళిపాలెం గ్రామంలో చెన్నబోయిన కొమురయ్య రెండేళ్ల క్రితం మృతి చెందాడు.
Ration card జాబితా నుంచి కొమురయ్య పేరును తొలగించాల్సి ఉండగా అతడి భార్య కొమురమ్మ పేరును తొలగించారు. Ration riceపైనే ఆధారపడి బతికే ఆమె పేరు మార్చాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగింది.
అక్క ఎటువంటి ఫలితం లేకపోవడంతో స్థానిక BJP నాయకుడు ఎర్రోజు లక్ష్మణ్ సాయంతో సోమవారం జరిగిన ప్రజావాణిలో జిల్లా పాలనాధికారికి వినతి పత్రం అందజేసింది. బియ్యం కొనుగోలుకు ఇబ్బంది అవుతోందని వెంటనే కార్డులో పేరు మార్చి బియ్యం వచ్చేలా చూడాలని ఆమె వేడుకుంటోంది.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు నూతన రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు రేషన్ పంపిణీలో నూతన సంస్కరణలు తీసుకురావాలని సీఎం కేసీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
నల్లగొండలో నిత్య పెళ్లికొడుకు, 19 యువతులకు వల: మొదటి భార్య ఫిర్యాదుతో బాగోతం వెల్లడి
కాగా, గత జూలైలో రేషన్ బియ్యం మీద కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో కేవలం ఒక్క రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నా వాటిని తీసుకోవడంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
6కిలోల బియ్యం తీసుకోవడానికి రవాణాతో కలిపి 20 రూపాయలు వెచ్చించాల్సి వస్తుందన్నారు. దీనివల్ల నిరుపేద ప్రజలపై భారం పడుతోందన్నాని సీఎంకు వివరించారు ఎంపీ కోమటిరెడ్డి.
ఏపీలో జగన్ ప్రభుత్వం లబ్దిదారులకు ఇంటి వద్దే రేషన్ బియ్యం అందిస్తున్నారు... ఈ పంపిణీ విజయవంతం అయ్యిందని తెలిపారు. దానిని మోడల్‌గా తీసుకుని తెలంగాణలో కూడా ఇంటింటికి రేషన్ సరుకులు సరఫరా చేయాలని సూచించారు.
సివిల్ సప్లై శాఖ వాలంటీర్లను నియమించి ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తే రేషన్ కార్డుదారులకు ఉపయుక్తంగా ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సూచించారు.