మంత్రి జగదీష్ రెడ్డిపై కోమటిరెడ్డి ఆగ్రహం

First Published Feb 6, 2018, 1:33 PM IST
Highlights
  • జగదీష్ రెడ్డి మంత్రిగా పనికిరాడు
  • ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి హత్యా రాజకీయాలు చేస్తున్నడు
  • గుత్తా సుఖేందర్ ను అవమానిస్తున్నడు
  • కేసిఆర్ రిటైర్ అయిన తర్వాత బావ, బామ్మార్ది కొట్టకుంటారు

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిఎల్పీ ఆవరణలో మీడియాతో కోమటిరెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.

జగదీష్ రెడ్డి మంత్రి అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. తప్పుడు కాల్ డేటా అంటున్న మంత్రి... ఆ విషయాన్ని పోలీసులు ఎందుకు ఖండించలేదో చెప్పాలి? కాల్ డేటా ప్రకారం తిరిగి విచారణ చేస్తాం అని పోలీసు ఉన్నతాధికారులు నాకు హామీ ఇచ్చారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును సీబీఐ తో విచారణ జరిపించాలి. మిర్చి తగాదా అని పోలీసులు అంటుంటే...అంతర్గత తగాదాలు అని మంత్రి అంటున్నారు. ఏది వాస్తవమో తేల్చాలి.

ఒక మంత్రిగా సిబిఐ విచారణకు ఒప్పుకో...లేదంటే మంత్రి పదవికి రాజీనామా చెయ్. నువ్వు మంత్రిగా పనికిరావు. నువ్వు ఆరునెలలు మాత్రమే మంత్రిగా ఉంటావు. నాగారం మర్డర్ కేసులో, నూక బిక్షం, కడారి రాములు హత్య కేసులో జగదీష్ రెడ్డి ఉన్నది వాస్తవం కాదా...? దీన్ని ప్రూవ్ చేయకుంటే నేను ఎమ్మెల్యేగా కూడా కొనసాగను. టిఆర్ఎస్ లో చేరిన సుఖేందర్ రెడ్డి ని అవమానపరుస్తున్నావు. కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వడంలేదు.

నువ్వో బచ్చగాడివి.. వచ్చే ఎన్నికల్లో నువ్వు ఓడిపోతే మళ్ళీ చీపులిక్కర్ అమ్ముకోవాల్సిందే. కాల్ డేటా ఆధారంగా సిబిఐ విచారణ చేయాలనీ సీఎం కెసిఆర్ ను కోరుతున్నాం. మంత్రిగా జగదీష్ అనర్హుడు. నా పై ఇప్పటివరకు చిన్న పిట్టి కేసు కూడా లేదు. వచ్చే ఎన్నికల్లో జగదీష్ రెడ్డి డిపాజిట్ గల్లంతవడమే కాదు..  4వేల ఒట్లు కూడా రావు. మధన్ మోహన్ రెడ్డి హత్య కేసులో మంత్రి జగదీష్ ఎ2 గా ఉన్నారు. నూక బిక్షం ,కడారి రాంరెడ్డి కేసులో జగదీష్ ముద్దాయి. మంత్రి జగదీష్ లా హత్యా రాజకీయాలు చేసేవాడిని కాదు.

జిల్లా మంత్రిగా వుండి బోడ్డుపల్లి శ్రీను హత్యని నేటికీ కూడా ఖండించలేదు. ఎమ్మెల్యే వీరేశం తో మంత్రి జగదీష్ రెడ్డి జిల్లాలో హత్యా రాజకీయాలు చేస్తున్నాడు.

కెసిఆర్ రాజకీయాల నుంచి  రిటైర్ తర్వాత బావ – బావమరిది (కేటిఆర్, హరీష్ రావు) కొట్టుకుంటారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చిన్న చిన్న తగాదాలు సర్వసాధారణం.

click me!