ఆ తెలంగాణ మంత్రి మర్డర్ కేసులో ఉన్నాడు : కోమటిరెడ్డి

First Published May 24, 2018, 3:22 PM IST
Highlights

గరం.. గరం..

తెలంగాణలో ఒక మంత్రి, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మర్డర్ కేసులో ఇరుక్కున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమకు గన్ మెన్లను ఇవ్వాలంటూ గురువారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు డిజిపి మహేందర్ రెడ్డిని కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

హైకోర్టు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. ఆ విషయాన్ని డిజిపికి వివరించాము. తెలంగాణలో ప్రజా బలం లేని టిఆర్ఎస్ నాయకులకు గన్మెన్ లు ఇచ్చారు. కానీ మాకు ఎందుకు ఇవ్వడంలేదు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల విరేశ్లు మడ్డర్ కేస్ లో  ఉన్నారని డిజిపి కి చెప్పినం.  కోర్టు అనుకూల తీర్పు తర్వాత మా కార్యకర్తలు సబరాలు చేస్తే వారి పై కేస్ లు పెట్టారు. ఇదెక్కడి దారుణం. మీ పోలీస్ లు ఇలాంటి అక్రమ కేసులు అపకపోతే మొదటగా డిజిపి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించాం.

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 48 గంటల నిరాహార దీక్ష చేస్తాం. అధికారులు కోర్ట్ ధిక్కరణకు పాల్పడితే కోర్ట్ ధిక్కరణ కింద కోర్టుకు వెళ్తాం. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ లో బర్రెలను కొట్టినట్లు కొడుతున్నారు. తక్షణమే ఎమ్మెల్యేలకు కల్పించే సదుపాయాలు మాకూ కల్పించాలి. మా గొంతును నులిపేయాలని టిఆర్ఎస్ చూస్తుంది. మాకు గన్మెన్ లను పునరుద్ధరించాలి. డిజిపి తప్పించుకోవాలని చూస్తున్నాడు. కానీ కోర్టు తీర్పు అమలు చేయకపోతే మళ్లీ కోర్టు ధిక్కరణ కింద కేసు వేస్తాము.  గల్లీ,నుండి ఢిల్లీ వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తాం.

 

                    

                

click me!