కిషన్ రెడ్డి కొలువులో ఆమ్రపాలి: కేసీఆర్ కోర్టులో బంతి

Published : Jul 13, 2019, 11:10 AM IST
కిషన్ రెడ్డి కొలువులో ఆమ్రపాలి: కేసీఆర్ కోర్టులో బంతి

సారాంశం

అమ్రపాలి 2011 బ్యాచ్ ఐపిఎస్ అధికారి సమీర్ శర్మ భార్య. ఆయనది ఢిల్లీ స్వస్థలం. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. నిరుడు జనవరిలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఆమ్రపాలి గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అనుమతి లభిస్తే ఐఎఎస్ అధికారి ఆమ్రపాలి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి కొలువులో చేరనున్నారు. కిషన్ రెడ్డి ప్రైవేట్ కార్యదర్శిగా ఆమ్రపాలిని నియమించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. అయితే, అందుకు తెలంగాణ ప్రభుత్వం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. 

ఆ పదవి కోసం పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి ఆమ్రపాలికి అవకాశం దక్కింది. ఐఎఎస్ అధికారుల నుంచి సానుకూలమైన అభిప్రాయాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఆ పదవికి అమ్రపాలి పేరును ఖరారు చేసింది. 

అమ్రపాలి 2011 బ్యాచ్ ఐపిఎస్ అధికారి సమీర్ శర్మ భార్య. ఆయనది ఢిల్లీ స్వస్థలం. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. నిరుడు జనవరిలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఆమ్రపాలి గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?