
తెలంగాణా జెఎసి చైర్మెన్ కోదండరాం వచ్చే పది రోజులు చాలా బిజి బిజి. గత ఫేస్ బుక్ లైవ్ షో సక్సెస్ అయిన తర్వాత ఆయన సైన్యంలో ఉత్సాహం పెరిగింది. ఆయన విద్యార్థులతో, ప్రాజక్టుల ముంపు గ్రామాల బాధితులతో సమావేశం కావడం తీవ్రం చేస్తున్నారు. ఈ పది రోజుల కార్యక్రమ వివరాలివి:
10 ఫిబ్రవరి శుక్రవారం ఓయూ క్యాంపస్ లో విద్యార్థి సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం;సాయంత్రం 7 నుండి 8 గంటలవరకు ఫేస్ బుక్ లైవ్ షో
11, 12 ఫిబ్రవరి టీవీవీ శిక్షణా శిబిరం ఖమ్మం జిల్లాలో
13 ఫిబ్రవరి - 10 గంటలకు మిడ్ మానేర్ ముంపు బాధితులతో రాజన్న-సిరిసిల్ల జిల్లాలో సమావేశం , 11 గంటలకు కరీం నగర్ లో విద్యార్థి సంఘాల నాయకులతొ సన్నాహక సమావేశం, 12 గంటలకు బహుజన సామాజిక వేదిక సదస్సులో, మధ్యహ్నం 2.30 గంటలకు శంకరపట్నం లో యువజన సదస్సులో పాల్గొంటారు, సాయంత్రం 5 గంటలకు హుజురాబాద్ లో టీజేయేసీ ఆధ్వర్యంలో జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీ సన్నాయక సమావేశంలో పాల్గొంటారు.
14 ఫిబ్రవరి - వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో విద్యార్థి సంఘాల ప్రతినిధులతో నిరుద్యోగ నిరసన ర్యాలీ సన్నాయక సమావేశంలో పాల్గొంటారు.సాయంత్రం HMTV లైవ్ షో లో పాల్గొంటారు.
15 ఫిబ్రవరి - మహబూబ్ నగర్ లో అక్కడి జిల్లా జేయేసీ నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీ సన్నాయక సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం STUDIO-N టీవీ లైవ్ షోలో పాల్గొంటారు.
16 ఫిబ్రవరి - నల్గొండ లో అక్కడి జిల్లా జేయేసీ నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీ సన్నాయక సమావేశంలో పాల్గొంటారు.
17 ఫిబ్రవరి - 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల జేయేసీ నిర్వహించే MEET THE PRESS కార్యక్రమంలో పాల్గొంటారు. జనగామలో అక్కడి జిల్లా జేయేసీ నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీ సన్నాయక సమావేశంలో పాల్గొంటారు.
18 ఫిబ్రవరి - నిజామాబాద్ లో అక్కడి జిల్లా జేయేసీ నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీ సన్నాయక సమావేశంలో పాల్గొంటారు.
19 ఫిబ్రవరి - సిద్దిపేట లో అక్కడి జిల్లా జేయేసీ నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీ సన్నాయక సమావేశంలో పాల్గొంటారు.