అందులో మనం నెంబర్ 2: కోదండరాం

Published : Mar 14, 2017, 02:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
అందులో మనం నెంబర్ 2: కోదండరాం

సారాంశం

కొత్త రాష్ట్రంలో 2700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కోదండరాం పేర్కొన్నారు.

రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలోని రైతాంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, కొత్త రాష్ట్రంలో 2700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.

 

రైతాంగ సమస్యలపై జేఏసీ ఇకపై నిరంతర పోరాటం చేస్తోందని ప్రకటించారు. 24 మందితో రైతు జేఏసీ పేరుతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. తాను అందులో సభ్యుడిగా ఉన్నానని చెప్పారు.

 

భూ నిర్వాసితులను పట్టించుకోకుండా ప్రాజెక్టుల పేరుతో రైతులను ప్రభుత్వం దోచుకుంటుందని ధ్వజమెత్తారు.

PREV
click me!

Recommended Stories

Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ... తెలుగు రాష్ట్రాలపై స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
80s AI: ట్రెండ్ ఫాలో అవుతోన్న సీఎం సాబ్‌.. రేవంత్ రెడ్డి రెట్రో లుక్ చూశారా.?